నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ తమిళంలో ఇప్పటికే 100 కోట్ల వసూళ్ళని దాటింది. జనవరి 26 న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన ప్రియాంక అరుల్ మోహన్ కెప్టన్ మిల్లర్ విశేషాలని పంచుకున్నారు.

‘వరుణ్ డాక్టర్,’ ‘డాన్’ తెలుగు ప్రేక్షకులని విశేషంగా అలరించాయి. ఇప్పుడు కెప్టన్ మిల్లర్ తో తెలుగులోకి రావడం చాలా ఆనందంగా వుంది.దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ సినిమా, పాత్ర గురించి వివరంగా చెప్పారు. బాడీ లాంగ్వేజ్, క్యారెక్టరైజేషన్ విషయంలో దర్శకుడి విజన్ ని ఫాలో అయ్యాం. నా పాత్ర నచ్చితేనే ఎంచుకుంటాను. ‘కెప్టెన్ మిల్లర్’ కథ, నా పాత్ర నాకు బాగా నచ్చాయి. దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ స్పష్టమైన విజన్ ఉన్న సెన్సిబుల్ డైరెక్టర్. ఇంత పెద్ద కాన్వాస్ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది.


‘కెప్టెన్ మిల్లర్’ సినిమా చాలా ఫ్రెష్‌గా, డిఫరెంట్‌గా, యూనిక్ ఉంటుంది. 1930ల నేపధ్యంలో సాగే సినిమాలోని ప్రతి ఒక్కటీ ప్రేక్షకులకు ఫ్రెష్ గా కనిపిస్తుంది, విభిన్న కథ, పాత్రలు, కాస్ట్యూమ్స్, యూనిక్ స్టయిల్, గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ ప్రేక్షకులని తప్పకుండా అలరిస్తాయి.తెలుగు ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందని భావిస్తున్నాను. కథ, యాక్షన్, ఎమోషన్స్ ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి.

‘గ్యాంగ్ లీడర్’ తర్వాత నానితో మళ్లీ కలిసి వస్తున్న ‘సరిపోదా శనివారం’ సినిమా చాలా బాగా వస్తోంది. ప్రస్తుతం దాని షూటింగ్‌లో ఉన్నాను. – పవన్ కళ్యాణ్‌ గారి’ఓజీ’ సినిమా చేస్తున్నాను. పవన్ కళ్యాణ్, నాని, ధనుష్ వంటి వెర్సటైల్ నటులు  కష్టపడి, అంకితభావంతో పని చేస్తారు. చాలా హంబుల్ గా వుంటారు” అని చెప్పారు ప్రియాంక అరుల్‌ మోహన్

Leave a comment

error: Content is protected !!