యూనివర్సల్‌ హీరో కమల్‌ హసన్‌, లెజెండ్‌ డైరెక్టర్‌ మణిరత్నం కాంబినేషన్‌ అంటే ఎంత క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 36 సంవత్సరాల క్రితం 1987లో నాయగన్‌ మూవీతో సంచలనం సృష్టించిన ఈ కాంబినేషన్‌ ఇప్పుడు ‘ థగ్‌ లైఫ్‌ ‘ మరో సంచలనానికి తెరతీసారు. థగ్‌ లైఫ్‌ మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ క్రేజీ మూవీ టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ వీడియో పాన్ ఇండియా రేంజ్‌లో వైరల్‌ అయ్యింది. రీసెంట్ ఈ చిత్రం ప్రారంభోత్సవం అయ్యిందని తెలియజేస్తూ ఓ వీడియో రిలీజ్‌ చేసారు.


విక్రమ్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్ తర్వాత కమల్‌ నటిస్తున్న మూవీ కావడం.. అది కూడా మణిరత్నం డైరెక్షన్‌ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ లో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, జయంరవి, గౌతం కార్తిక్, జోజు జార్జ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
కమల్ హాసన్, మణిరత్నం, ఆర్ మహేంద్రన్, శివ అనంత్‌లు తమ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.

Leave a comment

error: Content is protected !!