భరత్‌ రెడ్డి, నవీన రెడ్డి జంటగా నటిస్తున్న మూవీ ‘బిఫోర్‌ మ్యారేజ్‌’. శ్రీధర్‌ రెడ్డి అటాకుల దర్శకత్వంలో ఎద్దుల నాగేశ్వరరెడ్డి నిర్మిస్తున్న చిత్రమే ఈ బిఫోర్‌ మ్యారేజ్‌. టార్జాన్‌ సుందరి, ప్రేమ ఘర్షణ, సంసార వీణ వంటి చిత్రాలు నిర్మించిన వై నాగశ్వరరెడ్డి తనయుడే ఈ వై జగదీశ్వర్ రెడ్డి. బిఫోర్‌ మ్యారేజ్ చిత్రంతో నిర్మాతగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రం జనవరి 26న రిపబ్లిక్‌ డే సందర్భంగా దాదాపు 100 ధియేటర్లలో రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఫిలిం చాంబర్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్ నిర్వహించారు.


2023 లో చిన్న సినిమాల సందడి బాగా చేసాయి.రీసెంట్‌ గా హనుమాన్‌ చిత్రం ఎంతటి ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే. అలాగే ఈ బిఫోర్‌ మ్యారేజ్‌ కూడా సంచలనం సృష్టించాలన్నారు ముఖ్య అతిధిగా విచ్చేసిన నిర్మాత ప్రసన్న కుమార్.
లేడీ ఓరియంటేడ్ మూవీ మాదిరిగా ఉంది.. హీరోయిన్ బాగా చేసింది. ఇలాంటి సినిమాల‌ను ఆదరించాలి.. ఈ ట్రైలర్‌ చూస్తుంటే యూత్‌ కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా అని తెలుస్తుందన్నారు మరో అతిధి రామ్‌ సత్యనారాయణ.


పెళ్లికి ముందు త‌ప్పు అనిపించ‌ని పొర‌పాటు.. లైఫ్‌లో ఒక్క‌సారిగా ఊహించ‌ని మార్పులు చోటు చేసుకుంటాయని, అదే విష‌యాన్ని వాస్తవానికి దగ్గరగా సినిమాను తెరకేక్కించాము. టీమ్‌లో ప్ర‌తి ఒక్క‌రూ బాగా చేశారన్నారు చిత్ర దర్శకుడు శ్రీధర్ రెడ్డి.
చిన్న విష‌య‌మే క‌దా అని యువ‌త పెడ‌దోవ ప‌డితే ఏం జ‌రుగుతుందో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించిన సినిమా ఇది. యదార్ధ సంఘటనల‌ ఆధారంగా ఈ సినిమాను నిర్మించాము. సినిమాలో సింగ‌ర్ మంగ్లీ పాడిన పాట భారీ హిట్ట‌వుతుంది. యువ‌తీయువ‌కుల‌కు మంచి మెసెజ్ ఇందులో ఉంటుందన్నారు చిత్ర నిర్మాత వై. జగదీశ్వరరెడ్డి.

 

Leave a comment

error: Content is protected !!