నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ రెండోసారి కలిసి పని చేస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ‘సరిపోదా శనివారం’లో నానిని కంప్లీట్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో అలరించనున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఎస్‌వీసీ సొంతం చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా గ్రాండ్ గా విడుదల చేయబోతుంది.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో వెర్సటైల్ యాక్టర్ ఎస్ జే సూర్య కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ షెడ్యుల్ లో ఎస్ జే సూర్య జాయిన్ అయ్యారు. ఈ చిత్రంలో ఆయన పాత్ర డైనమిక్ గా ఉండబోతుంది.ఇప్పటికే విడుదలైన సరిపోదా శనివారం అన్‌చెయిన్డ్ వీడియోకుట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

Leave a comment

error: Content is protected !!