నటశేఖర, సూపర్‌స్టార్ కృష్ణ ఆఖరిచిత్రం చూసే అదృష్టం కృష్ణ మహేష్‌ ఫ్యాన్స్‌కు దక్కబోతుంది. కృష్ణ విజయం పేరుతో మధుసూధన్‌ హవల్దార్ డైరెక్ట్‌ చేసిన మూవీ త్వరలో రిలీజ్‌ కు సిద్దం చేసింది అంబుజా మూవీస్ బ్యానర్. నాగబాబు, సుహాసిని, యశ్వంత్, ఆలీ, గీతాసింగ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. త్వరలో సెన్సార్‌ కార్యక్రమాలు జరుపుకుని రిలీజ్‌ కు సిద్దం అంటున్నారు నిర్మాతలు. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ ను ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో భాగంగా.. రీసెంట్ గా రిలీజయి ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న గుంటూరు కారం కేక్‌ కట్‌ చేసి సక్సెస్‌ సెలబ్రేట్‌ చేసారు. సూపర్‌స్టార్ కృష్ణ గారిని డైరెక్ట్ చేసే అదృష్టం దక్కడం చాలా ఆనందంగా ఉందన్నారు చిత్ర దర్శకుడు మధుసూధన్‌ హవల్దార్‌.
చిత్ర యూనిట్ తో పాటు ప్రముఖ దర్శకులు ముప్పలనేని శివ, సంజీవ్ కుమార్ మేగోటి, ప్రముఖ దర్శకనిర్మాత లయన్ సాయి వెంకట్, ప్రముఖ నిర్మాతలు ఎస్.వి.శోభారాణి, జె.వి.మోహన్ గౌడ్, గిడుగు క్రాంతి కృష్ణ, బిజినెస్ కో ఆర్డినేటర్ నారాయణ, ఆలిండియా కృష్ణ -మహేష్ సేన అధ్యక్షులు ఖాదర్ ఘోరి, పద్మాలయ శర్మ పాల్గొని, చిత్రం ట్రైలర్ విడుదల చేశారు.

Leave a comment

error: Content is protected !!