Navazuddin Siddiqui : విక్టరీ వెంకటేష్ 75 మైల్ స్టోన్, మోస్ట్ ఎవైటెడ్ మూవీ‘సైంధవ్’.వెరీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల వస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంతో తెలుగులో పరిచయం అవుతున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం జనవరి 13న గ్రాండ్ గా విడుదల కానుంది. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ చాలా యూనిక్ కేరక్టర్ లో నటించాడు.
తెలుగులో సరైన స్క్రిప్ట్ కోసం ఎప్పటినుంచో చూస్తున్న నవాజుద్దీన్ వెంకీ ‘సైంధవ్’ మూవీతో తన కోరిక తీర్చుకున్నారు. సైంధవ్ ఎంతో ఆసక్తికరమైన కథ . ఎప్పుడూ విలన్, హీరో పాత్ర అని చూడని ఆయన ఈ పాత్రలో ఒదిగిపోయారు. ఈ సినిమాలో నవాజుద్దీన్ తొలిసారిగా తెలుగులో నటించడంతో పాటు ఫస్ట్ టైమ్ తన పాత్రకు తనే డబ్బింగ్ కూడా చెప్పుకున్నాడు. ఇందులో అతడిది హైదరాబాది పాత్ర. హిందీ, కొంచెం తెలుగు రెండూ మాట్లాడే పాత్ర. ఆ పాత్రకు తనే డబ్బింగ్ చెబితేనే న్యాయం జరుగుతుంది. భాషని, భావాన్ని అర్ధం చేసుకొని మరీ ఆయన చెప్పడం విశేషం. ఏదైనా కొత్త భాష నేర్చుకున్నప్పుడు మొదట్లో కొంత కష్టంగానే వుంటుంది. భాష గురించి తెలుసుస్తున్న కొద్ది అది సులువైపోతుంది. తనకి ప్రామ్టింగ్ మీద నమ్మకం లేదు. ఎంత కష్టమైనా తన డైలాగులని నేర్చుకుని చెప్పడాన్నే ఆయన ఎంజాయ్ చేశారు.