Irakhan marriage : ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ వివాహం ఘనంగా జరిగింది. ఫిట్‌నెస్ శిక్షకుడు నూపుర్ శిఖరేను ప్రేమించి పెళ్ళి చేసుకుంది. బుధవారం జరిగిన ఈ వేడుకకు ఆమీర్ ఖాన్, అతని మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావుతో సహా కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
ఐరా ఖాన్ వివాహానికి సంబంధించిన కొన్ని గ్లింప్స్‌లను షేర్ చేసుకుంది, అందులో వరుడు నూపుర్ శిఖరే వినూత్న దుస్తులు ధరించాడు. వివాహం జరుగుతుండగా జిమ్ షార్ట్స్, నల్లటి వెస్ట్ తో వేదికమీదకు ఎంట్రీ ఇచ్చాడు. ఈ వేడుక నూపుర్ శిఖరే అసాధారణమైన రాకతో ఓ ప్రత్యేక టర్న్ తీసుకుంది. సాంప్రదాయక ప్రవేశం కాకుండా.. తన ఇంటి నుండి వేదిక వరకు జాగింగ్ తో వచ్చాడు. అది అందరి దృష్టిని ఆకర్షించింది.
కరోనా లాక్‌డౌన్ సమయంలోనే నూపుర్ ఆమీర్ ఖాన్‌కు శిక్షణ ఇస్తుండగా, ఐరా తన తండ్రితో వచ్చే క్రమంలో ఈ జంట ప్రేమలో పడింది. వారి నిశ్చితార్థం గత సంవత్సరం నవంబర్‌లో జరిగింది. నూపుర్ ప్రత్యేకమైన రాకపై తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఐరా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక కోల్లెజ్‌ను షేర్ చేసింది. జనవరి 8న ఉదయపూర్‌లో ఘనమైన వేడుకను ప్లాన్ చేస్తున్నారు. అక్కడ జంట తమ కుటుంబాలతో కలిసి పెద్ద ఎత్తున వేడుకలో పాల్గొంటారు.