Madhavi : ఒకప్పుడు ఆమె గ్లామర్ క్వీన్. అభినయంలో రాణి. అద్భుతమైన చిత్రాల్లో అసమానమైన ఎన్నో పాత్రలు పోషించి మెప్పించిన అభినేత్రి. ఆమె పేరు మాధవి. మన ఏలూరు అమ్మాయే. తూర్పుపడమర మూవీలో దాసరి నారాయణ రావు ఓ చిన్న పాత్ర ద్వారా ఆమెను తెలుగు తెరకు పరిచయం చేశారు. రెండు దశాబ్దాల కాలంలో తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో మొత్తం 300 చిత్రాలకు పైగా… నటించి మెప్పించిన నటీమణి ఆమె. తెలుగులో ఆమె నటించిన ఆఖరి సినిమా బిగ్ బాస్.
1996లో స్పిరిట్యువల్ గురు.. స్వామీ రామా ఆమె పెళ్ళి జరిపించారు. ఫార్మాస్యిటికల్ బిజినెస్ మేన్ రాల్ఫాశర్మను పెళ్ళి చేసుకున్నారు మాధవి. ఆ దంపతులకు ఇప్పుడు ముగ్గురు కూతుళ్ళు. ప్రస్తుతం మాధవి కుటుంబంతో సహా న్యూజెర్సీలో ఉంటున్నారు. క్రిస్మస్ సందర్భంగా తన ఫ్యామిలీ ఫోటోస్ తో మాధవి సడెన్ గా ఇన్ స్టాలో ప్రత్యక్షమయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.