Shanthi Priya :  ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? అదేనండీ.. సుమం ప్రతి సుమం సుమం అంటూ.. మహర్షి రాఘవకు నిద్ర పట్టనీకుండా అతని చేత సుచిత్రా సుచిత్రా అంటూ.. కలవరించేలా చేసిన అందాల హీరోయిన్. పేరు శాంతి ప్రియ. భానుప్రియకు స్వయానా చెల్లెలు. తమిళంలో ఆమె పేరు నిశాంతి. 1987లో ‘కాబోయే అల్లుడు’ అనే సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘మహర్షి, సింహస్వప్నం, యమపాశం, అగ్ని, రక్తకన్నీరు, కలియుగ అభిమన్యుడు, శిలా శాసనం, జస్టిస్ రుద్రమదేవి, నాకూ పెళ్ళాం కావాలి’ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఆమె 1992 లో ప్రముఖ హిందీ ఫిల్మ్ మేకర్ .. వి.శాంతారామ్ మనవడు సిద్ధార్ధ్ రాయ్ ను పెళ్లిచేసుకుంది. 1994 నుంచి సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. తిరిగి 2022 లో సరోజినీ నాయుడు బయోపిక్ తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ధారావి బ్యాంక్ అనే వెబ్ సిరీస్ నటిస్తోంది. అదీ మేటర్..

Leave a comment

error: Content is protected !!