Naa Saami Ranga : అక్కినేని  నాగార్జున .. తన కెరీర్ లో ఇప్పటి వరకూ చాలానే మలయాళ రీమేక్స్ లో నటించారు. అయితే వాటిలో కొన్ని మాత్రమే మంచి సక్సెస్  సాధించాయి. వాటిలో మొదటిది నిర్ణయం. ఇది మలయాళంలో మోహన్ లాల్ నటించిన వందనం సినిమాకి రీమేక్. మలయాళంలో ఆడినంతగా తెలుగులో ఆడలేదు. తర్వాత వారసుడు మూవీ కూడా మలయాళ సినిమా ‘పరంపర’ కి రీమేక్. పరంపర సినిమాను హిందీలో పూల్ ఔర్ కాంటే గా రీమేక్ చేస్తే దాన్నే తెలుగులో వారసుడుగా రీమేక్ చేశారు. వారసుడు తెలుగులో సూపర్ హిట్టయింది. వజ్రం సినిమా మలయాళ సూపర్ హిట్ స్పటికం రీమేక్ గానూ, చంద్రలేఖ మలయాళ సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. బావనచ్చాడు మలయాళ మూవీ లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ రీమేక్. భాయ్ సినిమా పోకిరీ రాజా రీమేక్ కాగా, రాజుగారి గది 2 ప్రేతమ్ మలయాళ సినిమాకు రీమేక్.. ఇంక ఇప్పుడు నాగ్ నటిస్తున్న నా సామిరంగ కూడా మలయాళ ‘పొరింజు మరియం జోస్’ సినిమాకి అఫీషియల్ రీమేక్. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!