హీరో సందీప్ కిషన్, క్రియేటివ్ డైరెక్టర్ విఐ ఆనంద్‌ దర్శకత్వంలో ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో చేస్తున్న మోస్ట్ అవైటెడ్‘ఊరు పేరు భైరవకోన’తో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధంగా వున్నారు. ఇప్పుడు ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రొడక్షన్ నెం. 26 కోసం మళ్లీ ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో జతకట్టారు. ధర్మ ప్రొడక్షన్స్ మొదటి ఓటీటీ చిత్రం ‘గిల్టీ’తో తన నటనను ప్రారంభించి, ఆ తర్వాత విమర్శకుల ప్రశంసలు పొందిన ఆంథాలజీ సిరీస్ రే, స్ట్రీమింగ్ సిరీస్ మోనికా ఓ మై డార్లింగ్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఆకాంక్ష రంజన్ కపూర్.. ఈ చిత్రంలో సందీప్ కిషన్ కు జోడిగా నటిస్తున్నారు. పైన పేర్కొన్న ఓటీటీ కంటెంట్‌తో ఇప్పటికే తన నటనా నైపుణ్యాన్ని నిరూపించుకున్న ఆకాంక్ష రంజన్ కపూర్ మాయావన్ తో వెండితెర ఎంట్రీ ఇస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!