విశాల్ కొత్త సినిమా రత్నం. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి హరి దర్శకత్వం వహించారు. కళ్యాణ్ సుబ్రహ్మణ్యం, అలంకార్ ప్యాండన్ సహ నిర్మాతలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విశాల్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. తాజాగా ఈ చిత్రం టైటిల్‌తో పాటుగా, ఫస్ట్ షాట్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు వివేక్ పాటలు రాశారు. ఎం సుకుమార్ కెమెరామెన్‌గా పని చేశారు. ఈ చిత్రానికి టీ ఎస్ జయ్ ఎడిటర్. ఆర్ట్ డైరెక్టర్ పీ వీ బాలాజీ. కనల్ కన్నన్, పీటర్ హెయిన్, దిలిప్ సుబ్రయాన్, విక్కీ స్టంట్ మాస్టర్లుగా పని చేశారు.

Leave a comment

error: Content is protected !!