టైటిల్: అథర్వ
నటీనటులు: కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా, అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ యాదవ్, విజయ్ రామరాజు, గగన్ విహారి తదితరులు
నిర్మాత: సుభాష్ నూతలపాటి
దర్శకత్వం: మహేశ్ రెడ్డి
సంగీతం: శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ: చరణ్ మాధవనేని
విడుదల తేది: డిసెంబర్ 1, 2023
క్రైమ్ ఇన్విస్టిగేషన్ థ్రిల్లర్స్ అంటే ఆడియెన్స్‌లో ఓ క్యూరియాసిటీ ఉంటుంది. ఇలాంటి జోనర్స్ కి మినిమమ్ గ్యారెంటీ ఆదరణ ఉంటుంది. అలాంటి కోవలో వచ్చిన మూవీ అధర్వ. క్లూస్ టీమ్ బ్యాక్ డ్రాప్లో వచ్చిన ఈ మూవీ ఈరోజు ( డిసెంబర్ 1 , శుక్రవారం) రిలీజయ్యింది. ఆడియెన్స్ అంచనాలను అందుకుందా లేదా ఈ రివ్యూలో చూద్దాం.
కథ : కర్ణ (కార్తీక్ రాజు) కు పోలీస్ అధికారి కావాలనే కోరిక ఉంటుంది. తనకున్న హెల్త్ ఇష్యూ వల్ల సెలెక్ట్ కాలేకపోతాడు. అయితే..క్లూస్ టీమ్‌లో జాయిన్ అవుతాడు. తన కాలేజ్ మేట్ అయిన నిత్య (సిమ్రన్ చౌదరి) క్రైమ్ రిపోర్టర్ గా తిరిగి కలుస్తుంది. నిత్య మీద కర్ణ కు ప్రేమ ఉంటుంది కానీ చెప్పలేకపోతాడు. నిత్య ఫ్రెండ్ జోష్నీ(ఐరా) ఓ స్టార్ హీరోయిన్ . ఓ సందర్భంలో ఆమెను కలవడానికి వెళ్లిన నిత్య, కర్ణలకు పెద్ద షాక్. జోష్నీతో పాటు ఆమె ప్రియుడు శివ ఇద్దరూ శవాలై పడిఉంటారు. ఎలాంటి క్లూస్ లేని ఈ కేస్‌ని కర్ణ ఎలా సాల్వ్ చేస్తాడనేది మిగతా కథ.
కథనంః క్రైమ్ ఇన్విస్టిగేటివ్ బ్యాక్ డ్రాప్లో చాలా సినిమాలొచ్చినా.. క్లూస్ టీమ్ మెయిన్ లీడ్ తో కథ సాగడం ఈ సినిమా స్పెషాలిటీ. ఎలాంటి క్లూస్ లేని ఓ కేస్ ని హీరో రివీల్ చేయడం ఆడియెన్స్ ని థ్రిల్ చేస్తుంటుంది. ఈ సినిమా కూడా అదే ఆసక్తి రేకెత్తిస్తుంది. హీరో తన తెలివితేటలతో కేసు సాల్వ్ చేయడం థ్రిల్ చేస్తుంది. కథ సాధారణంగా ప్రారంభించినా.. జోష్నీ , ఆమెప్రియుడు శివ మర్డర్, రాబరీ కేస్ నుంచి వేగం పుంజుకుంటుంది. ప్రతీ సీన్ ఆసక్తికరంగా మలిచాడు దర్శకుడు. క్లైమాక్స్ తో మెప్పించాడు.
నటీనటులుః
కర్ణ పాత్రలో కార్తీక్ రాజు ఆకట్టుకున్నాడు. అటు లవ్ ఎమోషన్ని, క్లూస్ టీమ్ మెంబర్ గా ఇంటెన్సిటీని చాలా బాగా పర్ఫార్మ్ చేసాడు. సిమ్రన్ చౌదరి అందంగా కనిపించింది. హీరోయిన్ పాత్రలో ఐరా ఓకే అనిపిస్తుంది. మిగతా పాత్రలు పరిధి మేరకు బాగా నటించాయి.
టెక్నికల్ టీమ్ :
టెక్నికల్ గా ఈ సినిమా కు మంచి మార్కులు వేయొచ్చు. శ్రీచరణ్ సంగీతం సినిమా కు హైలెట్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సూపర్బ్. కెమెరా పనితనం మరో ఎస్సెట్. ప్రొడక్షన్ వేల్యూస్ సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి.
ట్యాగ్‌లైన్ : థ్రిల్ చేసే అధర్వ
రేటింగ్ : 3/5