ట్రెండ్ ను ఫాలో అవడంలోనూ, కళ్ళు చెదిరే రేంజ్ లో దుస్తుల్ని ధరించి.. అభిమానులకు మాంచి ఫీస్ట్ ఇవ్వడంలోనూ కొందరు కథానాయికలు చాలా ప్రత్యేకం. అందులో కన్నడ కస్తూరి పూజా హెగ్డే కూడా ఒకరు. కెరీర్ బిగినింగ్ లో కన్నా ఇప్పుడు అమ్మడి లో ఎంతో బ్రైట్ నెస్ , లావణ్యం కనిపిస్తున్నాయి. అందుకే ఆమె ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో టాప్ మెస్ట్ హీరోయిన్ గా చెలామణి అవుతోంది. ఇక పూజా సోషల్ మీడియా యాక్టివిటీస్ గురించి చెప్పాలంటే.. ఎంతో ఇంట్రెస్టింగ్. ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ లోఅమ్మడికి భారీ ఫాలోయింగ్ ఉంది. ఏదైనా అందమైన ఫోటో ఇలా పెడితే చాలు.. అలా భారీ లైక్స్ వచ్చి పడతాయి.
లేటెస్ట్ గా పూజా హెగ్డే ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఒక ఫోటో కుర్రకారు ను భలేగా ఆకట్టుకుంటోంది. పసుపు పచ్చని డిజైన్డ్ లాంగ్ గౌన్ ధరించి అమ్మడు బుట్టబొమ్మలా నవ్వుతూ కెమేరాకి పోజులిచ్చింది. ఇప్పటి వరకూ ఈ ఫోటోకి 5లక్షల లైక్స్ వచ్చాయి. అంతేకాదు కవ్వించే ఆమె అందాలకు కుర్రకారు భారీ ఎత్తున స్పందించి.. ఆమె పట్ల తమ ఆరాధనను తెలిపారు. ‘అల వైకుంఠపురములో’ ఘన విజయంతో మంచి ఉత్సాహంగా ఉన్న అమ్మాయిగారు.. మునుముందు ఇంకెలాంటి ఫోటోస్ తో దర్శనమిస్తుందో చూడాలి.