హను-మాన్ ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ అసలు సిసలైన సంక్రాంతి సినిమా: ఆవకాయ ఆంజనేయ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరో తేజ సజ్జ & డైరెక్టర్ ప్రశాంత్ వర్మ .
ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ హను-మాన్ నుంచి మూడవ సింగిల్ ఆవకాయ ఆంజనేయ పాట విడుదల. ఈ రోజు, హనుమాన్ టీమ్ చిత్రంలోని మూడవ సింగిల్ ఆవకాయ ఆంజనేయ సాంగ్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. హీరో తేజా సజ్జ మాట్లాడుతూ.. మనకి ఆపద వస్తే ఆంజనేయ స్వామి, ఆకలేస్తే ఆవకాయ..ఇది మన కల్చర్ లో బలంగా మనందరిలో పాతుకుపోయి వుంది. ఇదొక ఎమోషన్. అలాంటి కల్చర్ ని కమర్షియల్ వే లో చాలా గొప్పగా చూపించడానికి ప్రశాంత్ గారు ప్రయత్నించారు. దీనికి గ్రేట్ ట్యూన్ ఇచ్చిన అనుదీప్ గారికి, మంచి లిరిక్స్ ఇచ్చిన సింహా గారికి, అద్భుతంగా పాడిన సాహితి గారికి, హిందీలో పాడిన సునీధి చౌహాన్ గారికి మలయాళంలో పాడిన సితార గారికి థాంక్స్. అద్భుతమైన ఆలోచనని అంతే అద్భుతంగా విజువలైజ్ చేసిన ప్రశాంత్ గారికి థాంక్స్. ఈ సంక్రాంతికి హనుమాన్ థియేటర్స్ లోకి రాబోతుంది. అందరూ థియేటర్ కి వచ్చి చూడండి. ఈ పండక్కి హనుమాన్ తో థియేటర్లో పండగ చేసుకుందాం’’ అన్నారు.
హనుమాన్ జనవరి 12, 2024న తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో పాన్ వరల్డ్‌ విడుదల కానుంది.

Leave a comment

error: Content is protected !!