2018 లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా వచ్చి.. భారతీయ ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ ఇచ్చిన కన్నడ చిత్రం ‘కే.జీ.యఫ్’. ఈ సినిమాతో ఒక్కసారిగా హీరో యశ్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. మొటటి భాగం నిర్మాతలకు కాసుల వర్షం కురిపించడంతో.. ప్రస్తుతం కే.జీ.ఎఫ్ 2 ను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్ . మొదటి భాగం కన్నా రెట్టింపు బట్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీకి లాంచింగ్ టైమ్ లోనే సమ్మర్ లో విడుదలని అనౌన్స్ చేశారు. అందుకే ‘కే.జీ.ఎఫ్ 2’ విడుదల గురించి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కానీ ఇప్పుడు ‘కే.జీ.ఎఫ్ 2’ వేసవి కానుకగా విడుదలవడం కష్టమే అంటున్నారు. పాన్ ఇండియా కేటగిరిలో తెరకెక్కుతోన్నసినిమా కాబట్టి.. ఈ మూవీకి షూటింగ్ దగ్గరనుంచి అన్ని పనులు చాలా డిలే అవుతున్నాయని తెలుస్తోంది. అప్పటికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా అనుకున్న టైమ్ లో కంప్లీట్ అవడం కష్టం అంటున్నారు. అందుకే ఈ మూవీ విడుదలను సమ్మర్ సీజన్ నుంచి ఇండిపెండెన్స్ డే కి షిఫ్ట్ చేశారట. సరిగ్గా ఆగష్ట్ 15న విడుదల చేయడానికి తగిన విధంగా సినిమాను తీర్చిదిద్దుతున్నారని సమాచారం. ఆ మేరకు త్వరలోనే అనౌన్స్ మెంట్ జరుగుతుందని శాండిల్ వుడ్ టాక్.