మాఊరి పొలిమేర’ చిత్రానికి సీక్వెల్గా రూపొందిన చిత్రం “మా ఊరి పొలిమేర 2” డా.అనిల్ విశ్వనాథ్. దర్శకుడు. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల ముఖ్యతారలుగా నటించిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. గౌరికృష్ణ నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రముఖ పంపిణీదారుడు వంశీ నందిపాటి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. విడుదలైన రోజు నుంచి ప్రేక్షకాదరణతో బ్లాక్బస్టర్ విజయం దిశగా చిత్రం కొనసాగుతుంది. ఈ సందర్భంగా నిర్మత గౌరిక్రిష్ణ పాత్రికేయులతో ముచ్చటించారు.
నా తొలి సక్సెస్. చాలా కొత్తగా వుంది. నేను ఊహించని విజయం. ప్రేక్షకుల నుంచి ఇంత గొప్ప స్పందన వస్తుందని అనుకోలేదు. మొదట్లో అందరూ చిన్న సినిమాగానే చూశారు. ఫలితం ఓ పెద్ద సినిమాలా వచ్చింది. రోజు రోజుకు వసూళ్లు పెరుగుతున్నాయి. థియేటర్లు కూడా పెరిగాయి.
మొదటి పార్ట్ విజయం సాధించడం రెండో పార్ట్ విజయానికి ఎంత వరకు దోహదపడింది?
చాలా హెల్ప్ అయ్యింది. పార్ట్ చూసిన వాళ్లందరూ బాగుందని అన్నారు. ఈ రోజు పార్ట్-2 ట్రైలర్ విడుదల కాగానే పార్ట్ -1 ట్రెండింగ్లోకి వచ్చింది. మొదటి పార్ట్ హిట్ అయ్యిందని పొలిమేర 2 తీయలేదు. ముందే దీనికి సీక్వెల్ ప్లాన్ చేశాం. దర్శకుడి మీద నమ్మకంతోనే పొలిమేర -2 తీశాం
చేతబడుల నేపథ్యం ఎంచుకోవడానికి నేటి సమాజంలో జరుగుతున్నకొన్ని సంఘటనల ప్రేరణతో దర్శకుడు ఈ కథను రాసుకున్నాడు. కాన్సెప్ట్ కూడా కొత్తగా వుండటంతో ఈ నేపథ్యాన్ని ఎంచుకున్నాను.
గీతా ఆర్ట్స్ సంస్థ కు చెందిన వ్యక్తి విడుదల చేయడం వల్ల సినిమాకు బాగా ప్లస్ అయ్యింది.మంచి థియేటర్లు దొరకడం, మంచి ప్రమోషన్ చేయడంతో సినిమాకు మంచి బజ్ వచ్చిందన్నారు నిర్మాత.