పాయల్‌ రాజ్‌ పుత్ అంటే ఆర్‌ఎక్స్‌ 100 లాంటి బోల్డ్ క్యారెక్టర్సే గుర్తొస్తాయి. దాంతో పాటు అజయ్‌ భూపతి, హీరో కార్తికేయ కాంబినేషన్‌ గుర్తొస్తుంది. ఈ కాంబినేషన్‌ మంగళవారంమూవీ ట్రైలర్‌ లాంచ్‌ స్టేజ్ మీద సందడి చేసింది. RX 100 తర్వాత అజయ్‌ భూపతి, పాయల్‌ రాజ్‌పుత్‌ కాంబినేషన్‌ రిపీట్‌ చేస్తూ.. అజ్మల్‌ మేల్‌లీడ్‌తో స్వాతిరెడ్డి మంగళవారంమూవీ నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ను వినూత్నంగా మెగాస్టార్‌ చిరంజీవి, యంగ్‌ హీరో కార్తికేయ చేతుల మీదుగా రిలీజయ్యింది.

మంగళవారం మూవీ ట్రైలర్‌ ను మెగాస్టార్‌ చిరంజీవి ట్విట్టర్‌ వేదికగా రిలీజ్‌ చేస్తే.. స్టేజ్‌ పై లైవ్‌లో హీరో కార్తికేయ రిలీజ్‌ చేసారు. యంగ్‌స్టర్స్‌ ముఖ్యంగా యంగ్‌ విమెన్‌ సినీరంగంలో అడుగుపెట్టాల్సిన ఆవశ్యకత ఉందనీ.. స్వాతిరెడ్డి తన కూతురు శ్రీజకు స్నేహితురాలనీ.. సురేష్‌ వర్మ తనకు సన్నిహితుడనీ.. వీళ్లను ఎంకరేజ్‌ చేయడం ఎంతో సంతోషంగా ఉందనీ, డార్క్‌ రస్టిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ మంగళవారంమంచి హిట్టవ్వాలని మెగాస్టార్‌ చిరంజీవి ట్విట్టర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలియజేసారు.

హీరో కార్తికేయ.. ఆర్‌ఎక్స్‌ 100 తర్వాత అజయ్‌ కు, పాయల్‌కు తను ఫేవరెట్‌లా మారాననీ, ఎక్కడకెళ్లినా ఈ కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడొస్తుందని అడుగుతున్నారు.. చూస్తే వీళ్లిద్దరూ కలిసి సినిమా చేసారుమంచికి రోజులు కావంటూ సరదాగా మాట్లాడారు. ఈ సినిమా హిట్టవ్వాలని ఆకాంక్షించారు.

Leave a comment

error: Content is protected !!