యంగ్ హీరో నాగశౌర్య తాజా చిత్రం ‘అశ్వథ్థామ’ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న ఈ మూవీని ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై సొంతం గా నిర్మించడమే కాకుండా.. తొలిసారిగా కథను కూడా సమకూర్చాడు నాగశౌర్య. కొత్త దర్శకుడు రమణతేజ దర్శకత్వంలో ఇంటెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఇటీవల విడుదలైన ‘అశ్వథ్థామ’ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. యూ ట్యూబ్ లో షాకింగ్ వ్యూస్ వచ్చిపడ్డాయి.
నిజానికి ఈ సినిమాను.. అనుష్క ‘నిశ్శబ్దం’ చిత్రానికి పోటీగా విడుదల చేయాలని ఫిక్సయ్యాడు శౌర్య. కానీ , ‘నిశ్శబ్దం’ మూవీ విడుదల వాయిదా పడడంతో .. జనవరి 31 న వస్తోన్న‘అశ్వథ్థామ’ కు బంగారం లాంటి అవకాశం దొరికింది. విడుదలకు ముందే చిత్రం మీద మంచి హైపు రావడంతో .. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. షాకింగ్ ఓపెనింగ్స్ రావడం ఖాయం అంటున్నారు ట్రేడ్ వర్గాల వారు. అందుకే ఈ సినిమా నాగశౌర్య కెరీర్ కే స్పెషల్ గా మారింది. అంతేకాదు అతడు నటించనున్న మొట్టమొదటి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ఇదే కావడం విశేషం. మరి సోలో గా వస్తోన్న ‘అశ్వథ్థామ’ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ మ్యాజిక్ చేస్తాడో చూడాలి.