ప్రతీ మనిషికి ఒక ఆత్మ ఉంటుంది.. అలానే ఓ ఊరికి కూడా ఆత్మ ఉంటే ఎలా ఉంటుంది.. దాని కథ ఏంటి? అనేది సినిమాలో చూపించాం. తన కథను తాను చెప్పుకునే గ్రామం కనుకనే `మధురపూడి గ్రామం అనే నేను` అని టైటిల్ పెట్టాం అంటున్నారు దర్శకుడు మల్లి. లైట్‌హౌజ్ సినీ మ్యూజిక్ బ్యానర్‌పై క్యాథలిన్ గౌడ మెయిన్ లీడ్ తో మణిశర్మ సంగీత సారధ్యంలోరూపొందిన మూవీ మధురపూడి అనే గ్రామం. ఈ సినిమా అక్టోబర్ 13 న రిలీజ్ కాబోతున్న సందర్భంగా దర్శకుడు ఈ చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఆ విశేషాలు వారి మాటల్లోనే..
“ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా చేద్దాం అనే ఊహలోంచి పుట్టిన కథే మధురపూడి గ్రామం అనే నేను.నా చిన్నతనంలో ఓ స్టోరీ విన్నాను. ఓ వ్యక్తి తలను పట్టుకెళ్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడని విన్నాను. ఆ విజువల్ నాకు ఎప్పుడూ గుర్తుకు వస్తుంటుంది. దాన్ని అల్లుకుని ఈ కథను రాసుకున్నాను. కానీ ఆ ఘటనకు ఈ సినిమా కథకు ఎలాంటి సంబంధం ఉండదు.ఇది ఒక ఊరిలో జరిగిన కథ కాబట్టి మధురపూడి గ్రామం అనే నేను అనే చిత్రంలో స్నేహం, పాలిటిక్స్, యాక్షన్, ఎమోషన్ ఇలా ఒక ఊరిలో ఎమైతే ఎగ్జయిటింగ్ అంశాలు ఉంటాయో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. అలాగే హీరో హీరోయిన్ల మధ్య ఒక మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుంది.మణిశర్మ గారితో నాకు చాలా ఏళ్ల అనుబంధం ఉంది. సినిమా అద్భుతంగా వచ్చిందని ఆయన ప్రశంసించారు. ఆయన సంగీతం సినిమాకు ప్రధాన బలంగా మారుతుందని నమ్ముతున్నాను.కొత్త వాళ్లు అయితే నేను అనుకున్నది అనుకున్నట్టు తీయగలను అని భావించాను. రా అండ్ రస్టిక్‌గా ఉండే ఈ కథకు కొత్త వాళ్లైతేనే బాగుంటుందనిపించింది” అన్నారు చిత్ర దర్శకుడు మల్లి.