మంచి కమర్షియల్ సినిమా తీయకుండా.. టీచర్స్ మీద సినిమా తీస్తున్నారేంటి అని చాలా మంది అడిగారు… దానికి నా సమాధానం ఇదే.. అంటూ నిర్మాత ఎం సుధాకర్ రెడ్డి తను తీస్తున్న ‘నీతోనే నేను‘ అనే సినిమా పై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. ‘సినిమా బండి‘ ఫేమ్ వికాస్ వశిష్ఠ్, మోక్ష, కుషిత కళ్లపు మెయిన్‌లీడ్‌గా అంజిరామ్ దర్శకత్వంలో ‘నీతోనే నేను‘ శ్రీ మామిడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రాబోతుంది. ఈ సినిమా అక్టోబర్ 13 న రిలీజ్ కాబోతున్న సందర్భంగా మెదక్ లో గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
డిసెంబర్ నుంచి మే వరకు ఈ చిత్ర కథపై ఎంటైర్ టీమ్ కసరత్తు చేసాక.. కేవలం 33 రోజుల్లోనే షూట్ పార్ట్ కంప్లీట్ చేసామన్నారు చిత్ర నిర్మాత సుధాకర్‌రెడ్డి. అలాగే ఈ చిత్రం ప్రారంభించాక టీచర్స్ కు సంబంధించిన కథా నేపథ్యం ఎందుకు కమర్షియల్ సినిమా చేయొచ్చుగా అని చాలా మంది సన్నిహితులు అడిగారు. నా మీద, నా కథ మీద, నా చిత్ర యూనిట్ మీద.. నమ్మకంతో నా టీచర్స్ మీద ఉన్న గౌరవంతో ఈ చిత్రాన్ని ప్రారంభించామన్నారు.. ఈ సినిమా చూసిన ప్రతీ ఒక్కరు మా జిల్లా వాసి మంచి సినిమా తీసాడనే ఫీల్‌తో ఆడియెన్స్ ధియేటర్నుంచి బయటకొస్తారు అన్నారు ప్రొడ్యూసర్ ఎం సుధాకర్ రెడ్డి.
ఈ చిత్రం కోసం ఎంటైర్ టీమ్ నాలుగు నెలల పాటు కష్టపడ్డాం. ఫైనల్‌గా మంచి ఔట్పుట్ వచ్చింది. యాక్టర్స్ టాలెంట్, టెక్నికల్ టీమ్ సపోర్ట్ ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ , కెమెరామేన్ మురళీమోహన్ రెడ్డి గార్ల సపోర్ట్ చాలా గ్రేట్. ముఖ్యంగా ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి గారు మమ్మల్ని వెనకుండి నడిపించారు, క్వాలిటీకి వెనుకాడలేదు.. అందుకే తక్కువ టైమ్‌లో అక్టోబర్ 13 న రిలీజ్ డేట్ అనౌన్స్ చేయగలిగామన్నారు దర్శకుడు అంజిరామ్. మెదక్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ చేయడం వ్యక్తిగతంగా నాకు చాలా ఆనందంగా ఉందన్నారు దర్శకుడు అంజిరామ్.
ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ క్లీన్ U సర్టిఫికెట్ జారీ చేసింది. అక్టోబర్ 13 న రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.