సినీరచయితలు, జర్నలిస్టులంటే నాకెంత ప్రత్యేక స్థానం ఉంది. కొంతమంది జర్నలిస్ట్‌లు రాసే తప్పుడు రాతల వల్ల ఎంతో బాధపడ్డాను.. ఆ బాధ ఇప్పటికీ వెంటాడటం దురదృష్టకరం.. మెగాస్టార్‌ చిరంజీవి అన్న మాటలివి. సీనియర్‌ జర్నలిస్ట్‌ వినాయకరావు రాసిన తెలుగు సినీ పాత్రికేయ చరిత్రపుస్తకావిష్కరణలో భాగంగా మెగాస్టార్‌ చిరంజీవి జర్నలిస్ట్‌లతో రచయితలో వారికున్న అనుబంధాన్ని పంచుకున్నారు.

జర్నలిస్ట్‌ల పెన్నుకున్న పవర్‌ అంతా ఇంతా కాదు. వారు మంచి చెప్తే ఎంత ప్రభావం ఉంటుందో.. కొంతమంది జర్నలిస్ట్‌లు రాసే చెడు వార్తల వల్ల నేను కలత చెందిన సందర్భాలున్నాయి. ఆ ప్రభావం ఇప్పటికీ వెంటాడుతూనే ఉందన్నారు చిరు. నా తప్పులను సరిదిద్దుకునేందుకు ప్రేరణ కల్పించే వార్తలు రాసిన గుడిపూడి శ్రీహరి వంటి జర్నలిస్ట్‌ల పట్ల అపారమైన గౌరవం ఉందన్నారు చిరు. వాస్తవాలను ప్రతిబింబించే జర్నలిస్ట్‌లు ఎందరికో స్పూర్తిదాయకమన్నారు చిరు.

నేను దర్శక రచయితల కన్నా ఎక్కువగా జర్నలిస్ట్‌లతోనే సంభాషిస్తుంటానన్నారు. జర్నలిస్ట్ వినాయకరావు
ఏ పుస్తకం రాసినా కూలంకషంగా చర్చిస్తూ, లోతుల్లోకి వెళ్లి రాయడం ఆయనకు అలవాటు..అలాగే అరుదైన ఫోటోలు సేకరిస్తుంటాడు. ముందు తరాలను దృష్టి లో పెట్టుకుని అతను చేసే ప్రయత్నం అభినందనీయం..ఎన్టీఆర్ గారి గురించి, దాసరి గారి గురించి, కృష్ణ గారి గురించి , నా గురించి ఎన్నో అరుదైన పుస్తకాలు రాశాడన్నారు మెగాస్టార్‌.

రచయిత వినాయకరావు మాట్లాడుతూ.. ఇది తనకు 12వ పుస్తకమన్నారు. ఈ పుస్తకం రాయడానికి నాలుగేళ్లు పట్టిందనీ.. జర్నిలిస్ట్‌లుగా మన చరిత్రను మనం ఎందుకు చెప్పుకోకూడదనే ఆలోచన వచ్చాక మొదలు పెట్టి.. టాకీ కాలం మొదలు నాటి సినీ జర్నలిస్ట్‌ల నుంచి నేటి సినీ జర్నలిస్ట్‌ల వరకు అందరి చరిత్ర ఇచ్చామన్నారు. బి.కె ఈశ్వర్‌, ట్రేడ్‌గైడ్‌ వేంకటేశ్వరరావు లు చాలా సహకారం ఇచ్చారన్నారు. కుటుంబాన్ని వదిలి.. ఊళ్లు పట్టుకుని తిరిగి సమాచారాన్ని సేకరించి పుస్తకం రాస్తే తగిన ప్రోత్సాహం అందట్లేదనీఇక మీదట పుస్తకాలు రాయడం మానేస్తున్నానని ప్రకటించారు.

వెంటనే చిరంజీవి స్పందిస్తూ.. మీ లాంటి వాళ్లు పుస్తకాలు రాయడం ఆపకూడదు. నిరాశ పడవద్దు. తప్పకుండా ఆర్థిక భారం పడకుండా స్పాన్సర్స్ దొరుకుతారు. మీ మాటను వెనక్కి తీసుకోవాలిఅని చిరంజీవితో పాటు అక్కడ ఉన్న జర్నలిస్టులు పట్టుబట్టడంతో వినాయకరావు తన మాటను వెనక్కి తీసుకుని మరో కొత్త పుస్తకానికి పూనుకుంటానని అన్నారు.
ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్ట్ ప్రభు స్వాగతం పలుకగావినాయకరావు రాసిన వివిధ పుస్తకాలను వివరిస్తూ, ఈ పుస్తక విషయాలను మరో సీనియర్ జర్నలిస్ట్ రెంటాల జయదేవ్ సభలో ప్రస్థావించారు. చిరంజీవి ఇంటి ప్రాంగణంలో ఆహ్లాదభరిత వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

Leave a comment

error: Content is protected !!