ఇప్పటి వరకు వచ్చిన కథలను ఎంచుకున్నాను.. ఇప్పుడు మాత్రం అనుకుని కథ తయారు చేయించాను అంటున్నారు నైట్రో స్టార్‌ సుధీర్‌బాబు. యాక్టర్‌ కమ్‌ రైటర్‌ కమ్‌ డైరెక్టర్ హర్షవర్ధన్‌ తో వర్క్‌ చేయాలనే ఆసక్తితో లేటెస్ట్ ఫిల్మ్ మామా మశ్చీంద్ర కథ తయారుచేయించానన్నారు సుధీర్‌ బాబు. సునీల్‌ నారంగ్‌, పుష్కర్‌ రామ్మోహన్‌ రావు నిర్మించిన మామా మశ్చీంద్ర అక్టోబర్‌ 6 న తెలుగు హిందీ భాషల్లో రిలీజ్‌ కాబోతుంది. ఈ సందర్భంగా హీరో సుధీర్‌బాబు విలేకరులతో చిత్ర విశేషాలు ముచ్చటించారు.

ఈ సినిమాలో ట్రిపుల్‌ రోల్ చేసానన్నారు సుధీర్‌ బాబుట్రిపుల్‌ రోల్‌ చేయడమే ఈ సినిమా పరంగా ఎక్కువ ఎక్సయిట్ చేసిన అంశం అన్నారు. మూడు క్యారెక్టర్‌లు తెలంగాణా, ఉత్తరాంధ్రా, రాయలసీమ యాసలో సాగుతాయన్నారు. ఓల్డ్ క్యారెక్టర్‌ కు బరువు పెరిగాననీ, మరో క్యారెక్టర్‌కు ప్రొస్తటిక్స్ వాడమన్నారు. రియల్‌ గా బరువు పెరగాలనుకున్నాను కానీ.. ఒకేసారి అంత బరువు పెరగడం మంచిది కాదని మహేష్‌బాబు గారు, ఫ్రెండ్స్‌ చెప్పారు. దాంతో ప్రొస్తటిక్స్‌ వాడామన్నారు. ఈ ప్రొస్తటిక్ గెటప్‌లో నన్న మా అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ కూడా గుర్తుపట్టలేకపోయాడు. నేనే ఫోన్‌ చేసి ఒకడొస్తాడు రానియ్యొద్దని చెప్పాను. ప్రొస్తటిక్‌ గెటప్‌లో వెళ్తే నన్ను ఆపాడు గంటసేపు గొడవ జరిగిందని సరదాగా చెప్పారు సుధీర్‌బాబు. ఇక యంగ్ క్యారెక్టర్‌ కోసం డైట్‌ రొటీన్‌ పాటించానన్నారు.

ఒక సీన్‌ కోసం సూపర్‌స్టార్ కృష్ణ గారితో యాక్ట్ చేయించాలనుకున్నాం.. అప్పటికే నటన ఆపేసారు. కానీ ఒప్పించగలననే నమ్మకం ఉంది.. ఈలోగా వారు స్వర్గస్తులయ్యారు అని కృష్ణ గారిని గుర్తు చేసుకున్నారు సుధీర్‌ బాబు.

ఫిజికల్‌ గా ఈ చిత్రం నాకు ఛాలెంజ్‌ అన్నారు సుధీర్‌ బాబు. కంటెంట్ ఉన్న కమర్షియల్ సినిమా.. ఖచ్చితంగా అన్ని వర్గాల వారికి నచ్చుతుందన్నారు హీరో సుధీర్‌ బాబు.

Leave a comment

error: Content is protected !!