ఫాదర్ ఆఫ్ జానపద సినిమాస్‌, ఫాదర్‌ ఆఫ్ తెలుగు మాస్‌ సినిమా విఠలాచార్య.. ఈ మాట అన్నది డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. వీఎఫ్ఎక్స్‌ లేని రోజుల్లోనే తెరపై అద్భుతాలు ఆవిష్కరించిన సినీ మాంత్రికుడు విఠలాచార్య పుస్తకాన్ని ఆవిష్కరించారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌.

జానపద బ్రహ్మ విఠలాచార్య జీవితం, సినీ ప్రస్థానం, వారి జీవిత పాఠాలు, నాటి సినీ అనుభవాలు నేటి తరానికి పరిచయం చేయాలనే ధృఢ సంకల్పంతో పుస్తకాన్ని ప్రచురణకు శ్రీకారం చుట్టారు మూవీవాల్యూమ్‌ అధినేత షేక్‌ జీలాన్‌ భాషా. ప్రతిభావంతులు, పుస్తక రచనలో మేటి అయిన శ్రీ పులగం చిన్నారాయణ గారు ఈ ప్రాజెక్ట్‌కు తోడు కావడంతో జై విఠలాచార్య పుస్తక ముద్రణ విజయవంతంగా పూర్తయింది. సీనియర్‌ పబ్లిసిటీ డిజైనర్‌, రఘుపతి వెంకయ్య అవార్డ్‌ గ్రహీత శ్రీ ఈశ్వర్‌ గారి ఆఖరి పెయింటింగే ఈ పుస్తక కవర్‌పేజీ. జై విఠలాచార్య ముఖచిత్ర పోస్టర్‌ను సూపర్‌స్టార్‌ కృష్ణ గారు లాంచ్‌ చేసారు. పుస్తకాన్ని సెన్సేషనల్‌ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ అక్టోబర్‌ 1 న ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ….

నేటి డిజిటల్‌ యుగంలో పుస్తక ప్రచురణ పట్ల ఆసక్తి చూపిన పబ్లిషర్‌ జీలాన్‌ భాషా ప్రయత్నాన్ని , రచయిత పులగం చిన్నారాయణ ప్రతిభను మెచ్చుకున్నారు.

విఠలాచార్య వీఎఫ్‌ఎక్స్‌ రాకముందే ఎన్నో అద్భుతాలు సృష్టించి ఫాదర్‌ ఆఫ్ జానపద సినిమాస్‌ అయ్యారు. వారిని ఫాదర్‌ మాస్‌ తెలుగు సినిమా అంటూ అభివర్ణించారు. తెలుగు సినిమా మొదలైన రోజుల్లోనే అడ్వంచరస్‌ సినిమాలు తీసిన గొప్ప సాంకేతిక నిపుణుడిగా వారిని చూస్తున్నానన్నారు త్రివిక్రమ్‌. ఇప్పటి తరానికి వారిని, వారి సినిమాలను వాటి తాలూకూ అనుభవాలు, అనుభూతులు, పాఠాలు ఎన్నో తెలపాలనే మూవీవాల్యూమ్‌ మీడియా ప్రయత్నం చాలా గొప్పది.. నేటి డిజిటల్ యుగంలో పుస్తక ప్రచురణ అంత లాభసాటి వ్యాపారం కాదు కానీ.. సినిమా పట్ల ఉన్న పిచ్చి, అభిరుచి ఉన్న జీలాన్‌, పులగం చిన్నారాయణ లాంటి వారి వల్లే ఇది సాధ్యమైందనీ.. పుస్తకాల పట్ల అభిమానం ఉన్న వ్యక్తిగా పులగం గారికి ఆ శక్తి, ఆసక్తి రెండూ ఉన్నాయి కాబట్టి ఇలాంటి మరెన్నో పుస్తకాలతో మూవీ వాల్యూమ్‌ మీడియా నుంచి పుస్తకాలు ప్రచురణ కావాలని ఆశిస్తున్నానన్నారు.

విఠలాచార్య సినిమాలు తీసినంత వేగంగా ఈ పుస్తకం రాశానన్నారు రచయిత పులగం చిన్నారాయణ. సూపర్ స్టార్ కృష్ణ గారు, కైకాల సత్యనారాయణ గారు, జమున గారు, వాణీశ్రీ గారు, రాజశ్రీ గారు, జయమాలిని గారు, నరసింహ రాజు గారు ఇలా ఎందరో అతిరథ మహారథులతో ఈ పుస్తకం కోసం ఇంటర్వ్యూలు చేశా. అలాగే, విఠలాచార్య గారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయనకు సంబంధించిన విషయాలు తెలుసుకున్నాను. తెలుగులో విఠలాచార్య గారు దర్శకత్వం వహించిన 39 సినిమాల తెరవెనుక విశేషాలు, ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, ఇప్పటి వరకు ఎక్కడ లేని సమాచారంతో ఈ పుస్తకం రెడీ చేశా. సినిమాలు, సాహిత్యంపై విపరీతమైన అనురక్తి ఉన్న త్రివిక్రమ్ గారి చేతుల మీదుగా ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగినందుకు చాలా ఆనందంగా ఉందిఅని చెప్పారు.

 

త్రివిక్రమ్‌ గారి చేతుల మీదుగా జై విఠలాచార్య పుస్తకం తొలి ప్రతిని అందుకోవడం ఆనందంగా ఉందన్నారు సీనియర్ సివిల్ సర్వెంట్‌ , రైల్వే ఉన్నతాధికారి రవి పాడి. ఎంతో పరిశోధించి విఠలాచార్య పుస్తకం రాసిన పులగం చిన్నారాయణ గారిని, పుస్తక ప్రచురణ చేసిన పబ్లిషర్‌ షేక్‌ జీలాన్‌ భాషా గారిని అభినందిస్తున్నానన్నారు రవి పాడి.

జర్నలిజం పట్ల ఆసక్తితో మీడియాలో ఫీల్డ్‌కొచ్చి .. మూవీ వాల్యూమ్‌ మీడియా స్థాపించి ప్రచురణ రంగంలోకి అడుగుపెట్టి తొలి ప్రచురణే జానపద బ్రహ్మ విఠలాచార్య గారి బుక్‌ ప్రచురించడం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ గారు పుస్తకావిష్కరణ గావించడం చాలా ఆనందంగా ఉంది.. రచయిత పులగం చిన్నారాయణ గారి రచన, అనుక్షణం సహకారం వల్లే ఇది సాధ్యమైందన్నారు మూవీ వాల్యూమ్‌ మీడియా అధినేత షేక్‌ జీలాన్‌ భాషా.

Leave a comment

error: Content is protected !!