ప్రతీ ఒక్కరి జీవితంలో హనీమూన్ పిరియడ్ ఉంటుంది. అది లాంగ్ లైఫ్ ఉండాలని రూల్ లేదు.. ఒడిదుడుకులుంటాయి.. ఈ వాస్తవాన్ని చూపించేదే మంత్ ఆఫ్ మధు అంటున్నారు.. చిత్ర నిర్మాత యశ్వంత్. నవీన్ చంద్ర, స్వాతిరెడ్డి మెయిన్ లీడ్ గా సుమంత్ దామ సహ నిర్మాతగా.. శ్రీకాంత్ నాగోతి దర్శకత్వంలో యశ్వంత్ నిర్మిస్తున్న మూవీ మంత్ ఆఫ్ మధు. అక్టోబర్ 6 న రిలీజ్ కాబోతున్న సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో చిత్ర విశేషాలను ముచ్చటించారు.
మంత్ ఆఫ్ మధు అన్నీ లైవ్ లొకేషన్స్, సింక్ సౌండ్ తో చాలా ఎఫర్ట్ పెట్టి చేసామని, అచ్చు రాజమణి మ్యూజిక్ చాలా గొప్ప ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుందన్నారు యశ్వంత్. డైరెక్టర్ శ్రీకాంత్, హర్ష, నవీన్ చంద్ర మేం అందరం ఒక టీమ్.. ఈ కథ సెట్ అయ్యాక ఒకసారి నవీన్ కి చెప్తే నచ్చి ఓకే అన్నారు. అలా భానుమతి రామకృష్ణ టీమ్ మళ్లీ రిపీట్ అయ్యిందన్నారు.
భానుమతి రామకృష్ణ తర్వాత ఇంత గ్యాప్ రావడానికి మంచి కంటెంట్ కోసం వెయిట్ చేయడమేనన్నారు. స్వాతి రెడ్డి, నవీన్ చంద్ర ఈ ప్రాజెక్ట్‌లో జాయిన్ కావడం బలం చేకూరింది. అమెరికా నుంచి వచ్చిన ఓ అమ్మాయి కోసం శ్రేయాని తీసుకున్నాం.. ఆమె చాలా బాగా చేసిందన్నారు.
మంత్ ఆఫ్ మధు అన్ని సినిమాల మధ్య అక్టోబర్ 6న రిలీజ్ అవుతున్నా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం ఉందన్నారు యశ్వంత్.