సినిమా వాళ్లకు సెంటిమెంట్స్ చాలా ఎక్కువ. ఏ చిన్న విజయం లభించినా దానికి సెంటిమెంట్స్ ఆపాదించుకుని ఆ సెంటిమెంట్ ను అలాగే కొనసాగించటాన్ని సినిమా ఇండస్ట్రీలో చాలా తరచుగా చూస్తుంటాం. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామాలజీ వంటి జ్యోతిష్యాలతో పాటూ అచ్చి వచ్చిన వ్యక్తులు, అక్షరాలు, నెంబర్లు, స్థలాల విషయంలో కూడా సెంటిమెంట్స్ పాటిస్తుంటారు సినిమా వాళ్లు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక” షూటింగ్ స్పాట్ ” కు సంబంధించిన సెంటిమెంట్ ఒకటి బాగా పాపులర్ అయింది. అక్కడ షూటింగ్ చేస్తే సినిమా సూపర్ హిట్ అనే సెంటిమెంట్ ఒకటి బలంగా వినిపిస్తుంది. ఇంతకీ సినిమా వాళ్లకు అంతగా అచ్చి వచ్చిన ఆ షూటింగ్ స్పాట్ ఏమిటి…? అంటే “ఆదిత్య రామ్ ఫిలిం సిటీ ” అంటున్నాయి తమిళ సినీ వర్గాలు.

అవును… ఆదిత్య రామ్ ఫిలిం సిటీ లో షూటింగ్ జరుపుకున్న అత్యంత భారీ చిత్రాలలో 90 శాతానికి పైగా సూపర్ హిట్ అయ్యాయి అనే టాక్ ఆఫ్ సెంటిమెంట్ ఇప్పుడు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తుంది. ఈ సెంటిమెంటుకు తాజా ఉదాహరణగా నిలుస్తున్నాయి సూపర్ స్టార్ రజనీకాంత్ ‘ జైలర్ ‘, షారూక్ ఖాన్ జవాన్ చిత్రాల సక్సెస్. జైలర్ చిత్రంలో రజనీకాంత్, తమన్నాల మీద చిత్రీకరించిన “నువ్వు కావాలయ్యా…” పాటతో పాటు చాలా కీలక సన్నివేశాలను ఆదిత్య రామ్ ఫిలిం సిటీ లోనే షూట్ చేయడం జరిగింది. రోబో తర్వాత దశాబ్దన్నర కాలంగా హిట్ చూడని రజనీకాంత్ కు జైలర్ సక్సెస్ చాలా కీలకంగా మారింది . కాగా జైలర్ భారీ విజయంతో ఈ “షూటింగ్ స్పాట్ సెంటిమెంట్ ” టాక్ ఆఫ్ తమిళ ఇండస్ట్రీ అయింది. అయితే కేవలం సెంటిమెంట్ దృష్ట్యానే కాకుండా ఇంకా చాలా సౌలభ్యాల దృష్ట్యా తమిళ, హిందీ చిత్రాల దర్శక నిర్మాతలు హీరోలు ఆదిత్య రామ్ ఫిలిం సిటీని ప్రిఫర్ చేస్తున్నారు.

ఇంతకు ఏమిటీ ఆదిత్య రామ్ ఫిలిం సిటీ ప్రత్యేకతలు…? అంటే చాలానే ఉన్నాయని చెప్పవచ్చు. అవేమిటో చూద్దాం ………… * చెన్నై మహానగరంలో అత్యంత ఖరీదైన ఏరియా ఏది అంటే టక్కున వినిపించే పేరు ఈ.సీ. రోడ్. మహాబలిపురం వెళ్లే దారిలో దాదాపు 30 కిలోమీటర్ల మేర విస్తరిల్లిన ఈసీ రోడ్డులో ఆవిర్భవించినదే “ఆదిత్య రామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్”. చెన్నై రియల్ ఎస్టేట్ రంగంలో తిరుగులేని వ్యక్తిగా, శక్తిగా, వ్యవస్థగా ఎదిగిన ఆదిత్య రామ్ కు చెందిన “ఆదిత్య రామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ” లో అంతర్భాగమే ఈ “ఆదిత్య రామ్ ఫిలిమ్స్ ఫిలిం సిటీ “. * ఒకప్పుడు సినిమా వారితో, సినిమా షూటింగులతో కళకళలాడిన టి. నగర్, కోడంబాకం, వడపళని, వల్స రవాకం వంటి ఏరియాలు మితిమీరిన ట్రాఫిక్ ఆంక్షలతో దిబ్బందన స్థితికి చేరుకోవటంతో సినిమా వాళ్లు అటువైపు వెళ్ళటానికి ఏ మాత్రం సుముఖత చూపడంలేదు. అందుకు భిన్నంగా ప్రశాంత వాతావరణంలో బీచ్ కి అతి సమీపంలో ఆదిత్య రామ్ ఫిలిం సిటీ ఏర్పడటం దర్శక నిర్మాతలకు, హీరోలకు చాలా సౌకర్యవంతంగా ఉందట.

* నేటి తమిళ అగ్ర హీరోలైన రజనీకాంత్, కమలహాసన్, విజయ్, అజిత్, సూర్య ,కార్తీ, ధనుష్, శివ కార్తికేయ, విశాల్ వంటి హీరోలందరూ ఈసీ రోడ్డు పరిసరాల్లోనే నివసిస్తుండటం వల్ల ఆ హీరోలందరికీ ఇష్టమైన షూటింగ్ స్పాట్ అయింది ఆదిత్య రామ్ ఫిలిమ్స్ సిటీ. * ఇక సెంటిమెంట్ పరంగా చూసుకుంటే ఆనాటి కమలహాసన్ దశావతారం మొదలుకొని నేటి రజనీ కాంత్ జైలర్, షారూక్ ఖాన్ ల జవాన్ తో పాటూ తేరి, మెర్సల్, 24 సూర్య, ఆయిరత్తిల్ ఒరువన్, మావీరన్ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాల షూటింగ్స్ ఆదిత్య రామ్ ఫిలిం సిటీ లోనే జరగటం విశేషం. కాగా ప్రస్తుతం ఇద్దరు సూపర్ స్టార్స్ రజనీ కాంత్ అండ్ షారూక్ ఖాన్ లు నటించిన రెండు చిత్రాలు back to back సూపర్ హిట్స్ కావటంతో “ఆదిత్యా రామ్ ఫిలిమ్ సిటీ” తమిళ ఇండస్ట్రీ కి పెద్ద సెంటిమెంటల్ స్పాట్ అయింది .

అత్యంత రద్దీగా మారిన చెన్నై మహానగరంలో ఎకరాల కొద్ది ఓపెన్ స్పేస్ దొరకడం దుర్లభం. ఒకే ప్రాంగణంలో ఒకదానికొకటి సంబంధం లేకుండా దూర దూరంగా ఎవరి సెట్టింగ్స్ వాళ్ళు నిర్మించుకుంటూ భారీ చిత్రాల నిర్మాణం చేయాలి అంటే అందుకు అనువైన ఏకైక ప్రాంతం ఆదిత్య రామ్ ఫిలిం సిటీ ఒక్కటే. * దాదాపు ప్రముఖ హీరోల షూటింగ్ లు అన్నీ అక్కడే జరుగుతుండటంతో ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఒక షూటింగ్ స్పాట్ నుండి మరో షూటింగ్ కి షిఫ్ట్ అవ్వటానికి చాలా సౌలభ్యంగా ఫీల్ అవుతున్నారు. సో…ఇక్కడ షూటింగ్ జరిగితే ఆ సినిమా హిట్ అనే సెంటిమెంట్ తో పాటు ఇన్ని సౌకర్యాలు, సౌలభ్యాలు ఉన్నందుకే ఈ రోజున చెన్నై మహానగరంలో ఆదిత్య రామ్ ఫిలిం సిటీ “బిజీయస్ట్ ఫిలిం జంక్షన్ ” గా పేరుపొందింది. అంతేకాకుండా షూటింగ్ ల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆదిత్య రామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత అయిన “ఆదిత్యా రామ్ ” భారీ స్థాయిలో అత్యాధునిక సౌకర్యాలతో రెండు ఏసీ ఫ్లోర్స్ నిర్మాణాన్ని చేపట్టబోతున్నారు. కాబట్టి సెంటిమెంట్ అండ్ కంఫర్ట్ దృష్ట్యా సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి ఇది చాలా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ….All The Best to Adiya Ram Film City.

Leave a comment

error: Content is protected !!