కొత్తవాళ్లతోనే వర్క్ అవుట్ అయ్యే కథ ఇది. ఈ కథకు ఒక సామాన్యుడు కావాలి. కొత్తవాడైతే దానికి సహజత్వం వస్తుంది.అందుకే విరాట్ కర్ణ హీరోగా ఈ సినిమా తీసాం అంటున్నారు నిర్మాత మిరియాల రవీందర్. అఖండతో బ్లాక్ బస్టర్ అందుకున్న ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో మిరియాల రవీందర్ నిర్మిస్తున్న చిత్రం పెదకాపు 1. ఈ చిత్రం సెప్టెంబర్ 29 న రిలీజ్ సందర్భంగా పాత్రికేయులతో సినిమా విశేషాలు పంచుకున్నారు నిర్మాత రవీందర్.
విరాట్ కర్ణ చూడటానికి హీరో మెటీరియల్.. కథ ప్రకారం హీరో సామాన్యుడై ఉండాలి.. విరాట్ కర్ణ అందుకు సరిగ్గా సరిపోతాడని నమ్మే విరాట్ కర్ణను పెదకాపుతో ఇంట్రడ్యూస్ చేస్తున్నామన్నారు. అఖండలాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పెద్ద హీరోలకు అడ్వాన్సులు ఇవ్వాలని ప్రజెర్ వచ్చింది.. కానీ కథ ఉంటే దానికి పెద్ద హీరో వేల్యూ యాడ్ అవుతాడు మంచి కథతో సినిమా తీద్దామనుకునే పెదకాపు చేసామన్నారు.
ప్రతి కథలో బలవంతుడు బలహీనుడు మధ్య పోరాటం వుంటుంది. ఇందులోకి వచ్చేసరికి నేటివిటీ తోడైయింది. ఈ కథ తెరపై చూస్తున్నపుడు ఒక సినిమాలా కాకుండా నిజ జీవితాన్నే తెరపై చూస్తున్న అనుభూతి కలుగుతుంది. శ్రీకాంత్ గారు రాసిన మాటలు గుచ్చుకుంటాయన్నారు. ఎక్కడ కుత్రిమంగా సెట్స్ వేయలేదు. వందశాతం నిజాయితీగా తీశాం. ఒక చరిత్రని కళ్ళ ముందు ఎలా చూపించాలో అలానే చూపించాం. 1980 నాటి పరిస్థితులని ప్రతిబింబిచేలా అన్ని రియల్ లోకేషన్స్ లో షూట్ చేశాం. రాజమండ్రి నుంచి ప్రతి రోజు రెండుగంటల పాటు జర్నీ చేసిమరీ కొన్ని సహజమైన లోకేషన్స్ లో షూట్ చేశాం. మరోసారి చెబుతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో వెట్రిమారన్, శ్రీకాంత్ అడ్డాల రూపంలో వస్తారన్నారు నిర్మాత మిరియాల రవీందర్. అఖండ 2 ఖచ్చితంగా ఉంటుంది, వివరాలు సమయానుసారం వెల్లడిస్తామన్నారు.