చిన్న సినిమాగా వచ్చి మంచి సక్సెస్‌ అందుకున్న చిత్రం అష్ట దిగ్భంధనం. సెప్టెంబర్‌ 22 న రిలీజైన ఈ చిత్రం అన్ని సెంటర్స్‌లో మంచి టాక్‌ తెచ్చుకుంది. ప్రేక్షకుల ఆదరణతో మంచి రెవెన్యూ రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 150కి పైగా థియేటర్స్‌లో విడుదలై మంచి టాక్‌తో విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. ఈ సందర్భంగా సోమవారం చిత్ర యూనిట్‌ హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో సక్సెస్‌మీట్‌ నిర్వహించింది. ఈ వేదికపై చిత్ర నటీనటులు, టెక్నీషియన్స్‌కు నిర్మాత మనోజ్‌కుమార్‌ అగర్వాల్‌, సురేష్‌ కొండేటిల చేతుల మీదుగా జ్ఞాపికలను బహూకరించారు.

దర్శకుడు పి.ఆర్ బాబా చెప్పిన కథ, నేరేట్ చేసిన విధానంతోనే సినిమా సక్సెస్‌ పట్ల నమ్మకం వచ్చిందన్నారు నిర్మాత మనోజ్‌ కుమార్‌.

అష్టదిగ్భంధనం చిన్న చిత్రం.. పెద్ద నటీనటులెవ్వరూ లేరు.. ఎందుకు ఈ సినిమా ప్రమోట్ చేసి నిర్మాత డబ్బులు ఖర్చుపెట్టించడం అనుకున్నా.. సినిమా చూసాక ఖచ్చితంగా విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ప్రమోషన్ బాధ్యతలు తీసుకున్నానని చెప్పారు సురేష్‌ కొండేటి. మంచి కంటెంట్‌ ఉన్న సినిమా ఖచ్చితంగా ఆడుతుంది. మీరు ప్రమోషన్‌ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కావద్దని భరోసా ఇచ్చారు నిర్మాత మనోజ్‌ కుమార్. దర్శకుడు బాబా మంచి హార్డ్ వర్కర్‌ అన్నారు.

ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లోనే సక్సెస్‌ కొట్టబోతున్నామని చెప్పానన్నారు హీరో సూర్య. నా నమ్మకం నిజమైనందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నానన్నారు. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు.

నేను అందుకున్న తొలి షీల్డ్ అష్టదిగ్భంధనం షీల్డేనన్నారు హీరోయిన్ విషిక. చిత్ర విజయం దర్శక నిర్మాతల క్రెడిట్టేనన్నారు.

ఈ చిత్రం విజయం పట్ల మొదట్నుంచి నమ్మకం ఉందన్నారు దర్శకుడు పీ.ఆర్‌ బాబా. సక్సెస్‌ ఫుల్ రన్‌ అవుతూ మంచి కలెక్షన్లు రాబట్టడమే కాదు .. చిత్ర పరిశ్రమనుంచి , ప్రేక్షకులనుంచి అభినందనలు, గుర్తింపు లభిస్తున్నాయి. అది చాలా గర్వంగా ఉందన్నారు దర్శకుడు బాబా. ప్రమోషన్స్ విషయంలో సురేష్‌ కొండేటి చేసిన కృషికి అభినందించారు. ఈ సినిమాకు సంబంధించి సురేష్‌ కొండేటినే మా దిల్‌రాజు మా సురేష్‌ బాబు అంటూ కితాబిచ్చారు.

Leave a comment

error: Content is protected !!