కన్నడ స్టార్‌ హీరో శివరాజ్‌ కుమార్ పాన్ ఇండియా మూవీ ఘోస్ట్‌‘. పొలిటికల్ లీడర్, ప్రొడ్యూసర్‌ సందేశ్‌ నాగరాజ్‌ సందేశ్‌.. శ్రీని డైరెక్షన్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుండి ఒరిజినల్ గ్యాంగస్టర్‌ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ ను రిలీజ్‌ చేసారు. తెలుగు తమిళ్‌ కన్నడ మళయాళ హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్‌ 19 న దసరా కానుకగా రిలీజ్ చేస్తున్నారు. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ లిరిక్స్‌ కూడా 5 భాషల్లో కూడా రిథమిక్‌ గా ఉన్నాయి. చెన్నై లయోలా కాలేజ్‌ లో రిలీజ్‌ అయిన ఈ పవర్‌ఫుల్ సాంగ్‌తో పాటు మేకింగ్ గ్లింప్స్‌ కూడా రిలీజ్‌ చేసారు. ఈ రెండు ఘోస్ట్ చిత్రం అంచనాలు పెంచేస్తుంది. టాప్‌ టెక్నిషియన్స్‌ పనిచేస్తున్న ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయణ్, అర్చన జాయిస్, సత్య ప్రకాష్, దత్తన్న ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు.కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో ఘోస్ట్ దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకి రానుంది.

Leave a comment

error: Content is protected !!