సూర్య, విషిక జంటగా రాబోతున్న మూవీ అష్టదిగ్భంధనంఈ చిత్రానికి బాబా పి.ఆర్‌ దర్శకుడు. మనోజ్‌ అగర్వాల్‌ నిర్మించిన చిత్రం ఇది. ఈ చిత్ర ట్రైలర్‌ ను రీసెంట్‌ సెన్సేషన్‌ బేబీ చిత్ర దర్శకుడు సాయిరాజేష్‌ లాంచ్‌ చేసారు. సాధారణంగా సినిమా ఫంక్షన్‌ల ఇంట్రస్ట్‌ ఉండదు.. కానీ బేబీ తర్వాత వచ్చిన క్రేజ్‌తో సన్నిహితుడు సురేష్‌ కొండేటి అడగటంతో వచ్చానన్నారు. డైరెక్టర్‌ బాబా గారు అద్భుతంగా తీసారన్నారు.

ఈ సినిమా ప్రతీ సీన్‌ థ్రిల్‌కు గురిచేస్తుంది, స్క్రీన్‌ ప్లే బేస్డ్ సినిమా అన్నారు డైరెక్టర్‌ బాబా పి.ఆర్‌. యాక్షన్‌ సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుందన్నారు. ఈ చిత్ర నటీనటులు వచ్చిన అతిధులు ఆహ్వానితులు ఈ చిత్ర విజయాన్ని కాంక్షించారు. అష్టదిగ్భంధనం మూవీ సెప్టెంబర్‌ 22న రిలీజ్‌ కాబోతుంది.

Leave a comment

error: Content is protected !!