మిస్‌ శెట్టి మిస్టర్ పొలిశెట్టి.. ఈ సినిమా జాతిరత్నాలకు రెట్టింపు ఎనర్జీ, ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుంది.. ఈ మాట అన్నది ఎవరో కాదు, సాక్షాత్తూ మెగాస్టార్‌ చిరంజీవి. ఈ సినిమాకు తొలి ప్రేక్షకుడు మెగాస్టార్‌.

మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమా చూసిన మెగాస్టార్‌ చిరంజీవి క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అంటూ చిత్ర టీమ్‌ను అభినందించారు. ఫస్ట్‌ నుంచి ఆఖరి వరకు వినోదం అందించిన మూవీ అంటూ మెచ్చుకున్నారు చిరు. అనుష్క చాలా రోజుల తర్వాత తెరపై కనిపిస్తున్నా మరింత అందంగా ఉందన్నారు. ఈ సినిమాలో ఎన్నో హిలేరియస్ మూమెంట్స్ ఉన్నాయంటూ ఎగ్జైట్‌ అయ్యారు. ఈ సినిమా వందశాతం నవ్వులు పంచుతుందన్నారు చిరు. అంతేకాదు ఈ సినిమాను ప్రేక్షకులతో కలిసి చూడాలన్న కోరిక బలపడిందన్నారు.

యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేష్ బాబు.పి ద‌ర్శక‌త్వంలో వంశీ, ప్రమోద్‌ నిర్మించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఈ నెల 7వ తేదీన తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది.

Leave a comment

error: Content is protected !!