సెప్టెంబర్‌ 2 న పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా … జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘తారంగా ‘ చిత్ర గ్లింప్స్‌, టీజర్‌, ట్రైలర్‌ను లాంచ్‌ చేసింది చిత్ర యూనిట్‌. సంపత్‌కుమార్‌ దర్శకత్వంలో శ్రీనివాసరెడ్డి కర్రి నిర్మిస్తున్న మూవీ ఇది. ట్ల ఇమ్మోర్టల్, కట్ల డాండి,పూజ నాగేశ్వర్ లు మెయిన్‌ లీడ్ చేసారు. సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఈ చిత్ర గ్లింప్స్‌, టీజర్‌,ట్రైలర్‌ లాంచ్ గ్రాండ్ గా జరిగింది. ముఖ్య అతిధిగా వరంగల్‌ ఎంపీ దయాకర్‌ రావు విచ్చేసి చిత్ర టీజర్ ను విడుదల చేయగా, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ గ్లిమ్స్ ను విడుదల చేశారు.యూసఫ్ గూడా జనసేన మహిళా అధ్యక్షురాలు స్వాతి రెడ్డి, నిర్మాత తుమ్మలపల్లి రామ సత్య నారాయణ, దర్శకుడు శివ నాగు, నైజాం డిస్ట్రిబ్యూటర్ రాజేంద్ర ప్రసాద్ లు చిత్ర ట్రైలర్స్ ను విడుదల చేశారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎంపీ దయాకర్ రావు, నవీన్‌ యాదవ్‌, స్వాతిరెడ్డి ఇతర సినీ ప్రముఖులు చిత్ర విజయాన్ని కాంక్షించారు. ఎస్ ఆర్ కె ప్రొడక్షన్స్ బ్యానర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్దమైంది.

Leave a comment

error: Content is protected !!