తారాగణం: విజయ్ దేవరకొండ, సమంతా రూత్ ప్రభు, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, రాహుల్ రామకృష్ణ మరియు ఇతరులు
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
సినిమాటోగ్రఫీ: మురళీవర్ధన్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి
బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్ LLP
రచన & దర్శకత్వం: శివ నిర్వాణ
రన్-టైమ్: 2 గంటలు 45 నిమిషాలు
విడుదల తేదీ: 01-09-2023
విజయ్ దేవరకొండ, సమంత జంటగా.. ఖుషీ టైటిల్ ఎప్పుడైతే అనౌన్స్ చేసారో.. అప్పటి నుంచే ఈ సినిమాకి విపరీతమైన హైప్ పెరిగింది. పవన్ కళ్యాణ్ క్లాసిక్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఖుషీకి ధీటుగా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూసారు. రిలీజైన పాటలు, టీజర్ , ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. 2023 సెప్టెంబర్ 1 న రిలీజైన ఖుషి ఆ అంచనాలను అందుకుందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ: కశ్మీర్లో జాబ్ చేస్తున్న విప్లవ్ (విజయ్ దేవరకొండ) ఆ జాబ్ మానేద్దామనుకునే టైమ్ కి ఆరా బేగం (సమంత) ను చూసి లవ్‌లో పడిపోతాడు. ఆమె ప్రేమ కోసం తిరుగుతాడు. అయితే కొన్నాళ్లకు ఆమె ముస్లిం కాదు బ్రాహ్మణ అమ్మాయి ఆరాధ్య అనే విషయం తెలుస్తుంది. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకుందామంటే.. విప్లవ్ తండ్రి (సచిన్ ఖేఢ్కర్) కఠోర నాస్తికుడు, ఆరాధ్య తండ్రి అంతా దేవుడే అని నమ్మే పూర్తి ఆధ్యాత్మికవాది. పెద్దల్ని కాదని పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత వీరి జీవితం ఎలా వుంది.. చివరకు ఏ మలుపు తీసుకుని ఎలాంటి ముగింపు పలికిందనేది తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ:
సాధారణంగా ప్రేమకథలన్నీ ఒకేలా ఉంటాయి. కాకపోతే ఆ ప్రేమ ఫీల్‌ని ప్రేక్షకులు ఫీలయ్యి శెభాష్ అనిపించడంలోనే ఉంది అసలు ప్రతిభ. అలాంటి ప్రతిభ గల దర్శకుడిగా శివ నిర్వాణకు పేరుంది.అయితే ఖుషీకి వచ్చేసరికి హీరో తొలిచూపులోనే హీరోయిన్ ని చూసి ప్రేమలో పడిపోవడం.. ప్రేమకోసం తిరగడం.. పెద్దల్ని కాదని పెళ్లి చేసుకోవడం లాంటి రొటీన్ కథకు రొటీన్ ట్రీట్మెంటే ఇచ్చాడు. కానీ ఎంటర్టైన్మెంట్ పూత పూయడంతో ఫస్టాఫ్ సాఫీగా సాగిపోతుంది. కథలో కాన్ఫ్లిక్ టర్న్ తీసుకుని ఇంట్రస్టింగ్ గా సాగాల్సిన సెకండాఫ్ ను సాగదీసాడు శివ నిర్వాణ. అయితే లాస్ట్ అరగంట మాత్రం తన మార్క్‌తో మెప్పించాడు దర్శకుడు. రచనా పరంగా కూడా శెభాష్ అనిపించుకుంటాడు. కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సన్నివేశాలు, వెన్నెల కిశోర్ కాంబినేషన్ సీన్స్ సూపర్బ్ అనిపించాయి.
నటీనటులు:
యాక్టర్స్ పరంగా ఖుషీ సినిమా బాధ్యతను మోసింది విజయ్ దేవరకొండ అనే చెప్పాలి. ఇలాంటి పాత్ర విజయ్‌కు కొత్త. గీత గోవిందంలో కూల్ గై గా కనిపించినా.. ఇందులో కాస్త డిఫరెంట్ పాత్ర. విజయ్ దేవరకొండ లుక్స్ పరంగా, యాక్టింగ్ పరంగా అద్దరగొట్టాడు. సమంత స్క్రీన్ ప్రజెన్స్ బావుంది. తన పాత్రకు తాను న్యాయం చేసింది. హీరో తండ్రి పాత్రలో సచిన్ ఖేఢ్కర్, హీరోయిన్ తండ్రి పాత్రలో మురళీ శర్మ, రోహిణి, జయరాంలు బాగా నటించారు. వెన్నెల కిశోర్ ఉన్నంత వరకు తనమార్క్ చూపించాడు.
టెక్నికల్ టీమ్ :
ఈ చిత్రానికి ప్రధాన బలం మ్యూజిక్. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం హైలైట్. అలాగే మురళీ వర్ధన్ సినిమాటోగ్రఫీ, టెక్నికల్ స్టాండర్డ్స్, మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వేల్యూస్ పరంగా సూపర్బ్ గా ఉంది.
బాటమ్ లైన్ : ఫస్టాఫ్ ‘ఖుషి’ ఖుషీగా.. !