జబర్ధస్త్‌ ద్వారా పాపులర్ అయిన కమెడియన్‌ గడ్డం నవీన్‌. తనదైన పంచులతో విచిత్రమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో గడ్డం నవీన్‌ పాపులర్ అయ్యాడు. తెలుగు ఇండస్ట్రీలో కే. రాఘవేంద్రరావు గారిని ఇమిటేట్ చేసే సాహసం చేసిన ఏకైక నటుడు గడ్డం నవీన్‌. సెప్టెంబర్ 1 న గడ్డం నవీన్‌ బర్త్‌డే సందర్భంగా స్పెషల్ స్టోరీ.
గడ్డం నవీన్ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరిగారు. తండ్రి కృష్ణ , తల్లి సక్కుభాయ్‌.. నవీన్ నాన్నగారు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఆర్ధిక కష్టాలుండేవి. చిరు వ్యాపారాలు చేస్తూ చదువుకున్న నవీన్‌… ఒకానొక టైమ్‌లో డబ్బు కోసం ఆఫీస్‌బాయ్‌ గా కూడా పనిచేసారట. యాక్టర్‌ కావాలనే తన కలను సాకారం చేసుకోవడానికి పేరెంట్స్‌ ఒప్పుకున్నారు. హీరో కావాలనే కోరికతో అవకాశాల కోసం అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగారు. ఆర్జీవి అవకాశం ఇచ్చినా.. తగిన పాత్ర కాదని వేరే చిన్న వేషం ఇచ్చి సరిపుచ్చారు. 1995 లో తన కో ఆర్టిస్ట్‌ బబితను సీక్రెట్‌ గా వివాహం చేసుకున్నారు. చాలా కాలం దాచినా బయటపడ్డాకు పేరెంట్స్ సీరియస్ అయ్యారు. కొన్నాళ్లకు అంతా సెట్ అయ్యింది. వీరికి పవన్‌ దినేష్, అక్షయ్‌కుమార్ లు పిల్లలు. నటిస్తూనే జాబ్ చేసుకుంటున్న నవీన్.. ఒకానొక బాగలేని పరిస్థితుల్లో గడ్డం పెంచితే.. ఆ లుక్ ప్లస్‌ అయి అవకాశాలు తెచ్చిపెట్టింది. మల్లెమాల శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి ప్రోత్సాహంతో జబర్ధస్త్‌లో చలాకీ చంటి, అవినాష్‌, అదిరే అభి టీమ్‌లలో స్కిట్స్ చేసి పాపులర్ అయ్యాడు. రాఘవేంద్రరావు గారిని ఆయన ముందే నటించి శెభాష్ అనిపించుకున్నారు గడ్డం నవీన్‌. అమెరికా వెళ్లాలనే చిరకాల కోరికను గేమ్‌ఛేంజర్‌ మూవీ ద్వారా తీర్చుకున్నారు. ఆ సినిమా షూటింగ్ అమెరికాలో వుండటంతో వెళ్లే అవకాశం దక్కింది.
ఇండస్ట్రీలో నిర్మాతగా సెటిల్‌ కావాలనుందంటున్న నవీన్‌.. ఇప్పటివరకు 150 సినిమాలు చేసారు. ప్రస్తుతం రామ్ చరణ్ గారి ‘గేమ్ ఛేంజర్’, విక్టరీ వెంకటేష్ గారి ‘సైందవ’,’ భైరవ కోన’, ‘మిస్టరీ’, ‘వృషభ’, ‘చూ మంతర్’, ‘భూతద్దం భాస్కర్’.. వంటి సినిమాలతో అలరించబోతున్న గడ్డం నవీన్‌ గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు.

Leave a comment

error: Content is protected !!