బాయ్స్ హాస్టల్.. ఈ సినిమా యూనిక్ కంటెంట్‌తో అన్ని భాషల్లోనూ సక్సెస్ఫుల్ అయ్యే స్క్రీన్‌ప్లేతో రాబోతున్న యూనిక్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్. ఈ సినిమాను చాయ్బిస్కట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. హాస్టల్ హుడుగారు బేకగిద్దరే పేరుతో కన్నడలో సూపర్ హిట్ అయిన ఫిల్మ్‌ను తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్న ప్రొడ్యూసర్ సుప్రియ యార్లగడ్డ తెలుగు వెర్షన్ రిలీజ్ సందర్భంగా పాత్రకేయులతో ముచ్చటించారు ఆ విశేషాలు చూద్దాం.
నేరుగా తెలుగు సినిమాలు ప్రొడ్యూస్ చేయగలిగే అన్నపూర్ణ స్టూడియోస్ ఓ డబ్బింగ్ ఫిల్మ్ ను ప్రొడ్యూస్ చేయడానికి కారణం బాయ్స్ హాస్టల్ మూవీలో ఉన్న యూనిక్ కంటెంట్ ప్రధాన కారణం అన్నారు సుప్రియ యార్లగడ్డ. ట్రైలర్ చూడగానే నవ్వొచ్చింది. ఈ సినిమాను రీమేక్ చేయడం కంటే వందలాది క్యారెక్టర్స్‌తో నేచురల్ ఫీలింగ్ తో ప్రజెంట్ చేసిన ఈ ఫిల్మ్ ను కాస్త తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా రష్మి, తరుణ్ భాస్కర్ లాంటి యూనిక్ యాక్టర్స్ తో రీషూట్ చేయించి తెలుగు ప్రేక్షకులకు యథాతథంగా అందించాలనే ఉద్దేశ్యంతో తెలుగు వెర్షన్ రిలీజ్ చేస్తున్నట్టు చెప్పారు సుప్రియ యార్లగడ్డ. రైటింగ్ పై కూడా చాలా శ్రద్ధ పెట్టాం. ఒకేసారి పదిమంది మాట్లాడుతుంటే అందులో జోక్స్ పేలుతాయి. దాన్ని తెలుగులో రాయడం అంత ఈజీ కాదు. దీన్ని చాలా చక్కగా రీ క్రియేట్ చేశామన్నారు సుప్రియ. నా ఫ్రెండ్స్ అందరూ నేను వుండే అపార్ట్మెంట్ కి రావడంతో అదొక మినీ సైజ్ హాస్టల్ లా అయిపోయింది అలా ఈ సినిమాతో కనెక్ట్ అయ్యానన్నారు సుప్రియ.
లెగసీ ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ‘మనం’ కోసం రెండేళ్ళ పనిచేశా. మరో పది రోజులు వుందనగా తాతగారి కండీషన్ తెలిసింది. అప్పటికే ఆయన 255 సినిమాలు పూర్తి చేసుకున్నారు. అది ఆయన చివరి సినిమాగా పూర్తి చేయాలని అనుకున్నపుడు నాపై ఎంత ఒత్తిడి వుంటుందో మీరే ఆలోచించండి. రోజు 22 గంటలు పని చేశాం. సినిమా విజయవంతమైయింది. ఇప్పుడు ఈ సినిమాకి అదే నమ్మకంతో ఉన్నామన్నారు. నాగార్జున గారి 100 వ సినిమా చైతు, అఖిల్‌తో స్పెషల్ సినిమా ప్లానింగ్ లో ఉన్నామన్నారు. బాయ్స్ హాస్టల్ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతందనే ఆశాభావం వ్యక్తం చేసారు ప్రొడ్యూసర్ సుప్రియ.