బాయ్స్ హాస్టల్ .. ఈమధ్య బాగా వినిపిస్తున్న పేరు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ లో యూనిక్ కాన్సెప్ట్ ఉంటుంది. కాస్త నేటివిటీకి తగ్గట్టుగా తీస్తే ఏ భాషకైనా సెట్ అయ్యే కథ బాయ్స్ హాస్టల్ అంటున్నారు ఈ చిత్ర దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి. ఆగస్ట్ 26 న ఈ చిత్రం తెలుగు వెర్షన్ రిలీజ్ సందర్భంగా నితిన్ కృష్ణమూర్తి పాత్రికేయులతో సినిమా విశేషాలను పంచుకున్నారు.
బాయ్స్ హాస్టల్లో స్వర్గీయ పునీత్ రాజ్‌కుమార్, కాంతారా స్టార్ రిషభ్‌శెట్టి, పవన్ , తరుణ్ భాస్కర్, రష్మీ గౌతమ్.. వీరు కాక ఇంకా 500 మంది ఆర్టిస్టులు కనిపిస్తారు. దాదాపు 120 కి పైగా పాత్రలకు డైలాగ్స్ ఉంటాయి. అన్నీ తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా డబ్బింగ్ చెప్పించడంలో చాయ్ బిస్కెట్ టీమ్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారన్నారు దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి. ఈ సినిమా చాయ్ బిస్కెట్ టీమ్‌తోనే తెలుగు వెర్షన్ రిలీజ్ చేయడానికి కారణం నా టీమ్ లాగే అనిపిస్తారు.. అభిప్రాయాలు కలుస్తున్నాయన్నారు. కర్నాటకలో ఇంజనీరింగ్ చదివేటైమ్లోనే సినిమా దర్శకుడినవ్వాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. లూసియా చిత్రానికి పవన్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ అయి తర్వాత జీటీవి కోసం ప్రోమోస్ యాడ్స్ చేసానన్నారు. హాస్టల్హుడు గారు బేకగిద్దరే కథ రాసి ఫ్రెండ్స్‌తో కలసి సినిమా తీసారు.. అది పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడదే సినిమాను తెలుగువెర్షన్లో రిలీజ్ చేస్తున్నారు. యూనిక్ కాన్సెప్ట్ ఉండటంతోనే చాయ్‌బిస్కెట్ వారికి నచ్చి అన్నపూర్ణ స్టూడియోస్ తో కలిసి తెలుగు లో రిలీజ్ చేస్తున్నట్టు చెప్పారు.
రష్మీ గౌతమ్ పాత్ర చాలా హాట్ అండ్ యూత్‌ఫుల్ గా ఉంటుందన్నారు. కన్నడలో రమ్య పోషించిన పాత్రను తెలుగులో రష్మీతో రీషూట్ చేసారు. ఇక తరుణ్ భాస్కర్ క్యారెక్టర్లో ఫుల్ ఫన్ ఉంటుంది..ఇంతకుముందు తరుణ్ భాస్కర్ ఎప్పుడూ ఇలాంటి క్యారెక్టర్ చేయలేదన్నారు.
పునీత్ రాజ్‌కుమార్ గారిని పోస్టర్ రిలీజ్ కోసం సంప్రదించినట్టు చెప్పారు. కాన్సెప్ట్ ప్రకారం పోస్టర్ చూసి పునీత్ గారు మొహం మీదే తిట్టాలి.. కానీ పునీత్ అలా చేయలేదు..మళ్ళీ కన్విన్స్ చేస్తే ఒప్పుకుని పోస్టర్ రిలీజ్ చేసారన్నారు. రిషభ్‌శెట్టి బాయ్స్ హాస్టల్ లో పూర్వ విద్యార్ధిలా కనిపిస్తారన్నారు.
తెలుగుప్రజలు కథ బావుంటే ఏ భాషా చిత్రాన్నైనా ఆదరిస్తారన్నారు. తాను బెంగళూరులో తెలుగు ప్రజలు ఎక్కువగా నివసించే ప్రదేశంలోనే పెరిగానన్నారు నితిన్ కృష్ణమూర్తి. తెలుగు లో ఛాన్స్ వస్తే బాలకృష్ణను డైరెక్ట్ చేయాలనుందన్నారు.