Shopping Cart 0 items - $0.00 0

‘83’ కోసం రంగంలోకి దిగిన నాగార్జున, కమల్ హసన్

 

బాలీవుడ్ లో మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘83’. 1983 లో  భారత క్రికెట్ జట్టు వరల్డ్ కప్ సాధించిన మహత్తర ఘట్టాన్ని దర్శకుడు కబీర్ ఖాన్ తెరపై ఆవిష్కరిస్తున్నాడు. యంగ్ సూపర్ స్టార్ రణవీర్ సింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ పాత్రను పోషిస్తుండగా…కపిల్ భార్య రోమీ భాటియాగా దీపికా పదుకొణే అభినయిస్తోంది.  వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటులు .. అప్పటి క్రికెట్ టీమ్ సభ్యులుగా నటిస్తున్నారు.  రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై విష్ణు వర్ధన్ ఇందూరి, మధు మంతెన, కబీర్ ఖాన్, దీపికా పదుకొణే , సాజిద్ నడియావాలా ఈ చిత్రాన్ని  సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇక ‘83’ చిత్రాన్ని  తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా.. తెలుగు వెర్షన్ కోసం నాగార్జున , తమిళ వెర్షన్ కోసం కమల్ హాసన్ రంగంలోకి దిగుతున్నారు. ఆ ఇద్దరూ చిత్రాన్ని తమ తమ భాషల్లో ప్రెజెంట్ చేస్తారన్నమాట. ఈ విషయాన్ని ఫాంటమ్ ఫిల్మ్స్ సోషల్ మీడియా వేదిక గా అనౌన్స్ చేసింది. ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్,  టీజర్ జనాన్ని బాగా మెప్పించాయి. మరి 83 తెలుగు, తమిళ వెర్షన్స్ కు ..  కమల్ హాసన్ , నాగార్జున ప్రమోషన్స్ ఏమేరకు కలసివస్తాయో చూడాలి.

Leave a comment

error: Content is protected !!