కంటెంట్‌ ప్రిన్స్‌ అయితే.. డైరెక్టర్‌ కింగ్‌.. కథ మనకున్న స్థలం అయితే.. అందులో ఇళ్లు కట్టడం డైరెక్షన్‌.. అందమైన సౌధంగా మలచడంలోనే దర్శకుడి ప్రతిభ.. ఈ మాటలు చెప్పింది జేడీ చక్రవర్తి. దయా వెబ్‌సిరీస్‌తో చాలా కాలం తర్వాత తెలుగు ఆడియెన్స్ ని పలకరించడానికి వస్తున్నాడు జేడీ. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ఆగస్ట్ 4 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న వెబ్‌సిరీస్‌ ఇది. ఈ సందర్భంగా నటుడు జేడీ చక్రవర్తి పాత్రికేయులతో ముచ్చటించారు.
ఈ సిరీస్‌ కోసం తనను డైరెక్టర్‌ పవన్‌ సాధినేని సంప్రదించినపుడు తాను వెబ్‌సిరీస్ లు చేసే మూడ్‌లో లేననీ, అందుకే డెసిషన్‌ చెప్పడం పోస్ట్‌ పోన్‌ చేసానని చెప్పాడు. అయితే వదలకుండా సినాప్సిస్‌ ఒక్కసారి చదవమని స్క్రిప్ట్‌ పంపారు. ఆ తర్వాత ఫోన్‌లో 10 నిమిషాలు పవన్‌ సాదినేని నేరేట్‌ చేసాడు. మొత్తం నేరేషన్‌ పర్సనల్ గా వచ్చి నేరేట్‌ చేస్తానంటే.. అవసరం లేదు ఈ సిరీస్‌ నేను చేస్తున్నానని చెప్పారట. ఎందుకంటే ఒక డైరెక్టర్‌ కథ మొత్తం 10 నిమిషాల్లో చెప్పగలిగితే అతనికి సబ్జెక్ట్‌మీద కమాండ్ ఉన్నట్టు అని ఆర్జీవి చెప్పిన మాటలు గుర్తొచ్చాయన్నారు. దయా వెబ్‌సిరీస్‌కు బలం దర్శకుడు పవన్‌ సాదినేని అని చెప్పారు.
ఈషా రెబ్బా, నంబీషన్ రమ్య, కమల్ కామరాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీకాంత్ మొహతా, మహేంద్ర సోని నిర్మించిన ఈ వెబ్‌సిరీస్‌ ఈ నెల 4న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Leave a comment

error: Content is protected !!