టాలీవుడ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎవెయిటెడ్ మూవీస్ ‘భోళాశంకర్’. మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ కొదవ వుండకూడదు. ముఖ్యంగా మ్యూజిక్ విషయంలో అస్సలు రాజీ పడరు. అందుకే మ్యూజిక్ డైరెక్టర్స్ కి చిరు సినిమా పెద్ద టాస్క్. అంతే పేరు కూడా తెస్తుంది. వేదాళం రీమేక్‌తో వస్తున్న బోళాశంకర్ కు మణిశర్మ వారసుడు మహతీ స్వరసాగర్ స్వరాలందించారు. ఆగస్ట్ 11 న రిలీజ్ కు రెడీ కావడంతో ఈ చిత్ర సంగీత దర్శకుడు మహతీ స్వరసాగర్ పాత్రికేయులతో తన సినీ అనుభవాలను పంచుకున్నారు.
మణిశర్మ గారి బర్త్‌డే రోజున డైరెక్టర్ మెహర్ రమేష్ భోళాశంకర్ కు మ్యూజిక్ ఆఫర్ ఇస్తే నేను నమ్మలేదు. కానీ అదే నిజమై.. మెగాస్టార్‌తో వర్క్ చేయాలన్న కల నెరవేర్చిందన్నారు. మెగాస్టార్ సినిమాకు మ్యూజిక్ చేయడం చాలా పెద్ద టాస్క్… మణిశర్మ, చిరు కాంబినేషన్లో బ్లాక్బస్టర్లుండటం మహతీస్వరసాగర్ కు పెద్ద టార్గెట్ క్రియేట్ చేసినట్టయిందన్నారు. వేదాళం రీమేక్ కావడంతో ఆ చిత్ర సంగీతదర్శకుడు అనిల్ ఎలా చేసారో.. అబ్జర్వ్ చేసి.. చిరు ఇమేజ్ కు తగ్గట్టు ఇక్కడ ఏం చేయాలి.. ఎంత వైవిధ్యంగా మ్యూజిక్ ఇవ్వాలో దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గట్టు ప్రిపేర్ అయినట్టుగా చెప్పారు మహతీ.
ఇక తాను చేసిన ప్రతీ బాణీ తండ్రి మణిశర్మకు వినిపించానని, ఎంత మాస్ బీట్ అయినా అందులో మెలోడీ ఉండేట్టు చూసుకోమన్నారని, కావాల్సిన చోట తనదైన సలహాలిచ్చారని చెప్పారు.
అందుకే బోళా పాటలు చాలా ఫ్రెష్‌గా, చిరు ఫ్యాన్స్‌నే కాకుండా మ్యూజిక్ లవర్స్ అందరినీ ఆకట్టుకునేలా వచ్చాయన్నారు. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా కథానాయికగా నటిస్తుండగా, చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్టైనర్ ను నిర్మిస్తున్నారు. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 11 న రిలీజ్ కాబోతుంది.