విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాలు ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. గ్రామీణ వాతావరణంలో ఉండే స్వచ్చత కథలో ప్రతిబింబిస్తే… ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అలాంటి విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న మూవీ కృష్ణగాడు అంటే ఓ రేంజ్. ఆగస్ట్ 4 న ఈ చిత్రం రిలీజ్ కానుండటంతో చిత్ర దర్శకుడు రాజేష్ దొండపాటి పాత్రికేయులతో ముచ్చటించారు.
ఈ చిత్రం కరోనా సమయంలో వచ్చిన ఆలోచనకు రూపం. విలేజ్ బ్యాక్‌డ్రాప్ చేయాలనే తన కలను ఓ స్నేహితుడు ద్వారా పరిచయం అయిన ఈ చిత్ర నిర్మాత రఘురామ్ పెట్లా గారికి నేరేట్ చేయడం తో ఆయనకు నచ్చి ఈ చిత్రం రూపకల్పన సాకారమయ్యిందన్నారు. ఈ చిత్రంలో లవ్ , ఫ్యామిలీ, విలేజ్ ఎమోషన్స్ అన్నీ పర్‌ఫెక్ట్‌గా మిక్స్ అయ్యాయని చెప్పారు. సాధారణంగా మేకర్స్ అంతా గ్రామీణ వాతావరణం కోసం గోదావరి జిల్లాలను ఎంచుకుంటారు. అయితే రాజేష్ దొండపాటి మాత్రం గుంటూరు సమీపంలోని ఓ గ్రామాన్ని ఎంచుకున్నట్టుగా చెప్పారు.
లీడ్ పెయిర్ రిష్వి తిమ్మరాజు, విస్మయశ్రీ లు చక్కగా నటించారన్నారు. చివరి 20 నిమిషాలు ప్రేక్షకులు థ్రిల్ అవుతారన్నారు. అలాగే అనుకున్న బడ్జెట్ లో, అనుకున్న టైమ్ లో ఈ చిత్రాన్ని పూర్తి చేయగలిగినట్టు చెప్పారు.
షూటింగ్ టైమ్‌లో అమెరికాలో ఉన్న నిర్మాత రఘురామ్ , ఫస్ట్ కాపీ వచ్చాక ఇండియా వచ్చి చూసి హ్యాపీ ఫీలయనట్లు చెప్పారు. అలాగే ప్రమోషన్స్ విషయంలో కూడా రాజీ పడకుండా క్వాలిటీగా చేస్తున్నారన్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 4 న రిలీజ్ చేస్తున్నారు.