గ్రామీణ సంస్కృతి సంప్రదాయాలను, మూలాలను ప్రతిబింబించే కథలకు ఇప్పుడు చాలా ఆదరణ ఉంది. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ బలగం. ఈ మూవీ ఎంతోమందికి స్పూర్తిని ధైర్యాన్నిచ్చి ఇలాంటి చిత్రాలను తమదైన స్టైల్లో రూపొందించడానికి దారి చూపింది. ఆ దారిలో వస్తున్న మూవీ సగిలేటి కథ. ఇది వాస్తవానికి ఓ నవల. ఆ నవలలోని అంశం ప్రేరణ మాత్రమే పూర్తిగా కథ ఒరిజినల్‌గా ఉంటుంది అంటున్నారు ఈ చిత్ర దర్శకుడు రాజశేఖర్ సుద్మూన్. కేవలం దర్శకత్వమే కాకుండా మల్టిపుల్ శాఖలను నిర్వహించారు రాజశేఖర్ సుద్మూన్. అతని ప్రతిభే హీరో నవదీప్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించేలా చేసింది.
చికెన్ తినాలనే ఓ కీలకపాత్రధారి దురాశ కారణంగా జరిగే పరిణామాలే ఈ చిత్ర కథాంశం అంటున్నారు. జాతర నేపథ్యంలో సాగే ఈ కథలో అందమైన ప్రేమకథతో పాటు ఎన్నో ఎమోషన్స్ మేళవింపుగా వస్తుందంటున్నారు. ఈ చిత్ర ట్రైలర్ ను జులై 31 న హైదరాబాద్‌లో లాంచ్ చేసారు. ఈ చిత్ర యూనిట్‌కు ప్రముఖ దర్శకులు ఆర్జీవి వీడియో బైట్ ద్వారా శుభాకాంక్షలు చెప్పారు.
ఈ చిత్ర దర్శకుడు రాజశేఖర్ సుద్మూన్ స్వతహాగా ఆర్జీవి అభిమాని కావడం.. ఆయన బాటలోనే అతి తక్కువ బడ్జెట్లో అద్భుతమైన కథను తయారుచేసి సగలేటి కథ సినిమా ను రెడీ చేసారు. ఈ చిత్రంతో యూట్యూబర్ రవి మహాదాస్యం హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఫీమేల్ లీడ్ విషిక లక్ష్మణ్ చేసింది.
చిత్ర దర్శకుడు రాయలసీమ వాసి కావడం, అక్కడి సంస్కృతి సంప్రదాయ మూలాలు తెలిసి ఉండటం చేత కథ అద్భుతంగా.. సినిమా అత్యద్భుతంగా వచ్చిందంటున్నారు. ఈ చిత్రం ధియేటర్లో మరింత రంజింపచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు దర్శకులు.
ఈ చిత్రానికి నవదీప్ సీ స్పేస్ ద్వారా సమర్పిస్తున్నారు. ఈ చిత్రం చూసినపుడే తెగ నచ్చిందన్నారు. ఈ సినిమా చూసాక వెజిటేరియన్స్ కూడా చికెన్ రుచి చూడాలనుకుంటారని అంత బాగా చికెన్ బ్యాక్‌డ్రాప్ ఉంటుందన్నారు. ఈ చిత్రం సమర్పకుడిగా వ్యవహరించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ఈ చిత్రాన్ని అశోక్ ఆర్ట్స్, షేడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. అలాగే, ఈ కార్యక్రమానికి హీరో సోహెల్, ప్రొడ్యూజర్ జి సుమంత్ నాయుడు విచ్చేసారు. సెప్టెంబర్‌లో ఈ చిత్రాన్ని ధియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.