వార్తా ప్రపంచంలో పెరిగిన వేగాన్ని దృష్టిలో పెట్టుకుని నకిలీకి దూరంగా నాణ్యతతో కూడిన వార్తలను అందించేందుకు శతవిధాల ప్రయత్నిస్తూ.. పాఠకుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్న వెబ్‌ మీడియా తెలుగు స్టాప్‌ డాట్‌ కామ్‌. పొలిటికల్‌, సినిమా, వింతలు, విశేషాలు, బ్రేకింగ్ న్యూస్‌ ఇలా అన్నింటా సమగ్రమైన వార్తా కథనాలను ఆకర్షణీయంగా అందిస్తున్న తెలుగు స్టాప్‌ డాట్‌ కామ్‌ అనతి కాలంలోనే పాఠకుల అభిమానాన్ని నమ్మకాన్ని చూరగొన్నందుకు గర్విస్తూ.. ప్రతీ పాఠకులకు ధన్యవాదాలు తెలుపుతోంది. తెలుగు స్టాప్‌ డాట్‌ కామ్‌ సేవలు కేవలం వెబ్‌ మీడియాకే పరిమితం కాకుండా మొబైల్‌ యాప్‌ ద్వారా కూడా అందించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. మండలాల వారీగా, నియోజక వర్గాల వారీగా ఎప్పటికప్పుడు సమాచారాన్ని వార్త కథనాల రూపంలో అందించేందుకు సిద్దమైంది.
ఇందుకోసం మొబైల్‌ యాప్‌ ను సిద్దం చేసింది తెలుగు స్టాప్‌ డాట్‌. యాప్‌ సేవలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ తెలుగు రాష్ట్రాల్లోని గ్రామ స్థాయిలో జరిగే వార్తా సమాచారం అందించే ఏర్పాటుతో తెలుగుస్టాప్ డాట్‌ కామ్‌ యాప్‌ ప్రారంభమైంది. ప్రాంతాలు, మతాలు, కులాలు, వర్గాలు, రాజకీయ పక్షపాతాలు లేకుండా నాణ్యమైన వార్తా సమాచారం అందించేందుకే ఈ తెలుగు స్టాప్‌ డాట్‌ కామ్‌ మొబైల్‌ యాప్‌ సిద్దపడింది. ఈ యాప్‌ ను తెలంగాణా రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగు స్టాప్ చీఫ్ ఎడిటర్ వడ్లమూడి రఘు, రావూరి సైదబాబు, సాధినేని మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. తెలుగు స్టాప్ మొబైల్ యాప్ ను ప్రతి ఒక్కరు ప్లే స్టోర్ నుంచి ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకుని ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
వెంటనే తెలుగుస్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.వార్తలను వీక్షించండి 👉👉https://TeluguStop.com/app | https://app.telugustop.com

Leave a comment

error: Content is protected !!