ఒరు అడార్ లవ్‌తో ఓవర్‌నైట్‌లో స్టార్‌డమ్‌ సాధించిన హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్‌. తనకొచ్చిన ఫేమ్‌తో మళయాళం, తమిళ్‌లో బాగానే స్కోర్ చేసింది. తెలుగులో తెలుగు స్ట్రెయిట్ మూవీస్‌ ఇష్క్ నాట్‌ ఏ లవ్‌స్టోరీ, చెక్‌ తో ఆడియెన్స్‌ను పలకరించింది. మూడో సినిమాతోనే పవర్‌స్టార్‌ మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసింది వింక్‌ బ్యూటీ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. జులై 28 న బ్రో మూవీ రిలీజ్‌ సందర్భంగా పాత్రికేయులతో ముచ్చటించారు.
బ్రో మూవీలో పవర్‌స్టార్‌ కాంబినేషన్‌లో యాక్ట్ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. పవన్‌ కళ్యాణ్‌తో చిన్న సీన్‌ లో నటించాలన్నా ఎంతో అదృష్టం ఉండాలనీ.. ఆ అదృష్టం నాకు దక్కిందని ఆనందం వ్యక్తం చేసింది ప్రియా ప్రకాశ్ వారియర్‌. కెరీర్‌ స్టార్టింగ్‌లోనే ఈ అవకాశం దక్కడం గొప్ప అనుభూతి అన్నారు. పవర్‌స్టార్‌ తో యాక్ట్ చేసేటపుడు ఏదో తెలియని ఆరా, వైబ్రేషన్‌ ఫీలయ్యేదాన్నని అన్నారు. పవన్‌ కళ్యాణ్‌తో సీన్స్‌ ఉన్నపుడు యాక్టింగ్ చేయడమే తప్పితే.. కలిసి మాట్లాడాలంటే భయమేసిందన్నారు. హాయ అని విష్ చేసి పవన్ కళ్యాణ్‌ను అలా చూస్తుండిపోయేదాన్ని అంటోంది వింక్‌ బ్యూటీ.
బ్రో మూవీలో అవకాశం ఎలా వచ్చిందో చెప్తూ.. ఇందులో తన పాత్ర పేరు వీణ అనీ, పవర్‌స్టార్‌ తో పాటు సాయితేజ్‌, కేతికలతో కూడా కాంబినేషన్‌ సీన్స్‌ ఉంటాయన్నారు. ఈ క్యారెక్టర్‌ కోసం డైరెక్టర్‌ సముద్రఖని ఎంతో మంది ఆర్టిస్టులను చూసారు ఫైనల్‌గా తనని సెలెక్ట్ చేసినట్టుగా చెప్పారు ప్రియా ప్రకాశ్ వారియర్‌. ఎలాంటి ఫిలిం బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా యాక్టింగ్ సర్కిల్‌లో ఉండటం అదృష్టమన్నారు.
చిన్నప్పటి నుంచి హీరోయిన్ కావాలనే కలలు కన్నాను. మంచి నటిగా పేరు తెచ్చుకోవాలనుకున్నాని, కెరీర్‌ స్టార్టింగ్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నానని ఇప్పుడిప్పుడే కరెక్ట్‌ డైరెక్షన్‌లో వెళ్తున్నానని చెప్పారు ప్రియా ప్రకాశ్ వారియర్‌.

Leave a comment

error: Content is protected !!