రష్మిక మందన్నా చాలా గ్యాప్‌ తర్వాత హైదరాబాద్‌లో సందడి చేసింది. అది కూడా సినిమా ఫంక్షన్‌ కోసం కాదు.. సినిమా జర్నలిస్ట్‌లకు సంబంధించిన హెల్త్‌ ఐడీ కార్డ్స్‌ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యింది. సాధారణంగా సినిమా వాళ్లు పిలిస్తే.. జర్నలిస్ట్‌లు వెళ్తారు. కానీ సినీ జర్నలిస్ట్‌ల కార్యక్రమానికి రష్మిక హాజరు కావడం విశేషం.
తెలుగు ఫిలిం జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ సభ్యుల, వారి కుటుంబ సంక్షేమం కోసం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అందిస్తోంది. ఈ అసోసియేషన్‌లో ఉండే సభ్యుడి కుటుంబానికి 3 లక్షల ఆరోగ్య భీమా పాలసీ, యాక్సిడెంట్ పాలసీ, టర్మ్‌ పాలసీలను ఉచితంగా అందిస్తోంది. సభ్యత్వం తీసుకున్న వారికి 2023 – 2024 సంవత్సరానికి గాను గుర్తింపు కార్డులు, హెల్త్ కార్డులు అందించే కార్యక్రమం ఏర్పాటు చేసారు.
ఈ మధ్య కాలంలో ఫిలిం జర్నలిస్ట్ సభ్యులలో ముగ్గురు ప్రమాద బారిన పడటంతో ఈ హెల్త్ ఇన్సూరెన్స్‌ పాలసీ ప్రవేశపెట్టినట్టు టిఎఫ్‌జేఏ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ తెలిపారు. ఒక మిత్రుడు 40 రోజుల పాటు కోమాలో ఉన్నాడు. మరో ఇద్దరు ముగ్గురు యాక్సిడెంట్స్ కారణంగా నడవలేని స్థితికి వెళ్లారు. ఆ సమయంలో వారి కుటుంబం పడిన బాధ వర్ణనాతీతం. అందుకే ఒకరికొకరు సహాయం చేసుకునే ఉద్దేశ్యంతో ఈ సంఘం ఏర్పాటు చేసి హెల్త్ ఇన్సూరెన్స్‌లు కడుతున్నామన్నారు లక్ష్మీనారాయణ. ఐదేళ్లుగా నిర్విరామంగా ఈ ఇన్సూరెన్స్‌ పాలసీ కడుతున్నాం. అడగ్గానే సంవత్సరం పాటు ఇన్సూరెన్స్‌ కు కావాల్సిన మొత్తాన్ని అందిస్తానని హామీ ఇచ్చిన దిల్‌రాజు గారికి, ఈ విషయం తెలిసి అడగకుండానే సహాయం చేసిన మెగాస్టార్‌ చిరంజీవి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు లక్ష్మీనారాయణ. అలాగే  ఇన్సూరెన్స్‌ నిమిత్తం అయిన అమౌంట్‌ మీ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేస్తానని చెప్పినట్టుగానే చేస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్‌ అధినేతల్లో ఒకరైనే నవీన్‌ ఎర్నేని గారు, అలాగే సాహు గారు, సునీల్‌ నారంగ్‌ గారు ఇలా ఎంతోమంది నిర్మాతలు , దర్శకులు సహాయ సహకారాలు అందిస్తున్నారు.   సహకరిస్తున్న వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సంఘ అధ్యక్షులు లక్ష్మీనారాయణ.
తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులకోసం సినిమా పెద్దలందరూ సహకరిస్తున్నారు. మనకు కష్టం వస్తే వారు ఆదుకుంటున్నారు. అలాగే వారికి కష్టమొస్తే సంఘం అంతే అండగా నిలుస్తుందని తెలిపారు టీఎఫ్‌జేఏ ప్రధాన కార్యదర్శి వై రాంబాబు. సోషల్ మీడియాలో హీరో హీరోయిన్స్‌ గురించి , సినీ పెద్దల గురించి చాలా నాన్సెన్స్ జరుగుతోంది. వారు ప్రత్యేక దృష్టి పెట్టలేరు.. ఫిలిం జర్నలిస్ట్‌ సంఘం ఈ విషయంలో వారికి అవసరమైన మద్దతు ఇస్తోందన్నారు. యతిక ఇన్సూరెన్స్  ఈ సంఘానికి ప్రత్యేక ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడంలో ప్రత్యేక బాసట అందిస్తోంది. హాస్పిటల్‌ పాలయితే వారానికి పదివేల చొప్పున ఐదేళ్ల పాటు పాలసీ వర్తించేలా చేస్తున్నారని తెలిపారు.
హైదరాబాద్‌ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయిన రష్మిక..  ఈ కార్యక్రమానికి పిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేసారు. మీరెప్పుడూ నవ్వుతూనే ఉండాలని సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు రష్మిక.
ఈ కార్యక్రమానికి  గౌరవ అతిథులుగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన నవీన్ యెర్నేనిగారు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ గారు, షైన్ స్క్రీన్స్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి గారితో పాటు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్.పి, ఏసియన్ సినిమాస్ సిఎమ్ఓ జాన్వీ నారంగ్ గారు హాజరయ్యారు.

Leave a comment

error: Content is protected !!