పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే హీరోయిన్స్ ఎగిరి గంతేస్తారు అనడానికి కేతిక శర్మ రీసెంట్ కామెంట్స్ ఎగ్జాంపుల్. బ్రో మూవీలో సాయిధరమ్ తేజ్‌కు జోడీగా నటిస్తున్న కేతిక.. జులై 28 రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా పాత్రికేయులతో ముచ్చటించారు. ఈ మూవీలో యాక్టింగ్ చేయడం గొప్ప అనుభూతినిచ్చిందన్నారు. ఈ సినిమాలో అవకాశం ఎలా వచ్చిందో చెప్తూ.. అక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్. ఆ పేరు చాలు.. కథ వినకుండానే ఒప్పుకోవడానికి. నేను కూడా పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో వెంటనే ఒప్పేసుకున్నా అన్నారు. అయితే ఈ సినిమాలో పవర్‌స్టార్‌తో కాంబినేషన్ సీన్స్ లేకపోవడంతో ఎక్కువ కలిసే అవకాశం రాలేదు.. పవన్ కళ్యాణ్‌తో నేరుగా వెళ్లి మాట్లాడటానికి భయం వేసిందన్నారు. సాయిధరమ్ తేజ్ తో చెప్తే తీసుకెళ్లి పరిచయం చేసారనీ… పవర్‌స్టార్ తో మాట్లాడిన ఐదు నిమిషాలు చాలా గొప్ప అనుభూతినిచ్చిందన్నారు కేతిక.
ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్‌తో పోల్చితే చాలా మార్పులు చేసారన్నారు. ముఖ్యంగా తన పాత్ర నిడివి, ప్రాధాన్యత ఎక్కువ వుందని చెప్పారు. ఫన్నీ డైలాగ్స్ ఉంటాయి. ఇందులో సందేశంతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారని చెప్పారు కేతిక.
రంగరంగవైభవంగా చిత్రంలో వైష్ణవ్‌తో ఇప్పుడు సాయిధరమ్‌తేజ్ తో యాక్ట్ చేసాను.. వైష్ణవ్ సిగ్గుపడతాడు.. సాయి జోవియల్ గా ఉంటాడని చెప్పారు.
సముద్రఖని గారు ఫాస్ట్ డైరెక్టర్. ఆయన ఎక్కువ టేక్స్ తీసుకోరు. తక్కువ టేక్స్ లోనే మన నుంచి బెస్ట్ అవుట్ పుట్ రాబడతారు. ఆయనకు ఏం కావాలో ఆయనకు స్పష్టంగా తెలుసు. ఆయన చాలా తెలివైన దర్శకులు. త్రివిక్రమ్ గారి అద్భుతమైన రచన కూడా ఈ సినిమాకి తోడైందన్నారు.