మెగాస్టార్‌ చిరంజీవి హాల్‌.. ఇదెక్కడో తెలుసా.. తెనాలి పక్కన ఉన్న కొల్లిపర్ల మండలం చక్రాయపాలెం గ్రామంలో. అక్కడెక్కడో ఉన్న గ్రామంలో చిరు పేరుతో హాల్ ఎవరు నిర్మిస్తున్నారు అని ఆలోచిస్తున్నారా.. ? మెగాస్టార్ వేసిన పునాధిని వల్లభనేని బాలశౌరి పూర్తి చేస్తున్నారు. విషయం ఏంటంటే.. మెగాస్టార్‌ చిరంజీవి ఎంపీ గా పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న టైమ్‌లో 2012 – 14 మధ్యకాలంలో గుంటూరు జిల్లా లో ఉన్న చక్రాయపాలెం గ్రామంలో కమ్యూనిటీ హాలును నిర్మించడానికి 25 లక్షలు కేటాయించారు. వాస్తవానికి ఆ నిధులు కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం చేయడానికి పూర్తిగా సరిపోకపోవడంతో నిర్మాణ పనులు ఆగిపోయాయి. అయితే ఇప్పుడు చక్రాయపాలెం గ్రామాన్ని తన గ్రామంగా భావించే మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఆ నిర్మాణ పనులు పూర్తి చేయడానికి నడుం భిగించారు. కమ్యూనిటీ హాలు నిర్మాణానికి కావాల్సిన 40 లక్షల నిధులను అందిస్తున్నారు. నాలుగు నెలల్లో ఈ నిర్మాణం పూర్తయ్యేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఇంకో విశేషమేంటంటే.. ఈ కమ్యూనిటీ హాలు నిర్మాణానికి బీజం వేసిన మెగాస్టార్‌ చిరు పేరు మీదుగా చిరంజీవి కమ్యూనిటీ హాలుగా నామకరణం చేస్తున్నట్టుగా ప్రకటించడం విశేషం. ఇద్దరు డెడికేటెడ్‌ ప్రజాసేవకులు ఉంటే ఏదైనా సాధ్యమే అని సామాన్య జనం చెప్పుకోవడం నిజంగా గర్వకారణమే.

Leave a comment

error: Content is protected !!