ఒకప్పుడు ఆరుబయట అమ్మలక్కలు పిల్లా పెద్దలు కలసి మాట్లాడుకోవడం… అభిప్రాయాలు అభిరుచులు పంచుకోవడం ఆటపాటలు ఆడుకోవడం ఇలా ఎన్నో సరదాలు ఉండేవి. కానీ ఇప్పుడున్న సమాజంలో అలాంటివి కరువైపోయాయి. గేటెడ్ కమ్యూనిటీస్‌ వచ్చాయి. అలాంటి వారందరి కథను మాయాబజార్ ఫర్ సేల్ అనే సూపర్బ్ కామెడీ వెబ్‌ సిరీస్‌ ను జీ5 సంస్థ, రానాకు చెందిని స్పిరిట్‌ మీడియా సంయుక్తంగా నిర్మించాయి. ఈ వెబ్‌సిరీస్‌కు గౌతమి చిల్లగుల్ల దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌ జీ 5 ఓటీటీలో ఏప్రిల్ 14 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ను నిర్వహించారు. ఈ వెబ్‌సిరీస్ యాక్టర్స్ తో పాటు తరుణ్ భాస్కర్‌ ఇతర సినీ ప్రముఖులు హాజరయ్యారు.
ఇది మాయాబజార్‌ ప్రీమియరా.. ? బాహుబలి ప్రీమియరా ఇంతమంది ఆర్టిస్టులను ఒకచోట చేర్చడం చాలా గ్రేట్‌ అన్నారు సీనియర్ యాక్టర్ నరేష్‌.
రైతుబజార్‌లో వంకాయలేరుతూ అనుకున్న కథతో ఈ వెబ్‌సిరీస్ చేసినట్టు చిత్ర రచయిత శ్వేత చెప్పారు.
ఒకప్పటి అందరూ ఆరుబయట కూర్చుని కబుర్లాడుకునే సంస్కృతి ఉండేది. ఇన్నాళ్లకు గౌతమి, శ్వేత లు ఈ వెబ్‌సిరీస్‌తో అలాంటి ఫీల్ ను తీసుకొచ్చారన్నారు. రామానాయుడు గారు స్టార్ట్‌ చేసిన అఖండదీపాన్ని రానా ముందుకు తీసుకెళ్తున్నాడని అభినందనలు తెలియజేసాడు నవదీప్‌.
ఎప్పుడూ పనిమనిషి క్యారెక్టర్లేం చేస్తావ్‌.. అల్ట్రా మోడ్రన్‌ గ్లామర్‌ క్యారెక్టర్‌ చేయమని ప్రోత్సాహించారు మేకర్స్ అని చెప్పారు హరితేజ.
ఇతర నటీనటులు వెబ్‌సిరీస్‌ అనుభవాలను పంచుకున్నారు.

Leave a comment

error: Content is protected !!