‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని అని ఎలుగెత్తి చాటే దేశభక్తులు అన్ని రంగాల్లోనూ ఉన్నారు. అమెరికాలో డాక్టర్‌గా స్థిరపడి ఇప్పుడు భారత్‌పై చైనా దురాగతాలను ప్రపంచానికి చూపించడానికి నిర్మాత అవతారం ఎత్తారు డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి. భారతీయన్స్ పేరుతో ప్రతీ ఫ్రేమ్‌లోనూ దేశభక్తిని నింపే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి దీన్‌రాజ్ దర్శకుడు. ప్రేమించుకుందాం రా , కలిసుందాం రా, ప్రేమంటే ఇదేరా చిత్రాల రచయిత గా దీన్ రాజ్ కు మంచి పేరుంది. జులై 14 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్స్‌లో మీడియా , పాత్రికేయుల సమావేశం జరిగింది.
దేశభక్తిని రంగరించి తీసిన ఈ చిత్రాన్ని ప్రతీ భారతీయుడు చూసి గర్వించేలా ఉంటుందని దర్శకుడు దీన్ రాజ్ నమ్మకాన్ని వ్యక్తం చేసారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంటుందని భరోసా ఇస్తున్నారు.
ఈ చిత్రానికి ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయనీ, సెన్సార్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు నిర్మాత. ఔట్ పుట్ చూసాక, ప్రివ్యూ చూసిన వారి రెస్పాన్స్ చూసాక పడ్డ కష్టాలన్నీ మర్చిపోయామని చెప్పారు నిర్మాత డాక్టర్ శంకర్‌నాయుడు అడుసుమిల్లి.
భారతీయన్స్ లాంటి చిత్రంతో పరిచయం కాబోతున్నందుకు గర్వంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేసారు చిత్ర హీరో నీరోజ్. దేశభక్తి కథాంశం ఉన్న చిత్రం డ్రాగన్ కంట్రీ దురాగతాలను బయటపెట్టే ఇలాంటి చిత్రానికి మ్యూజిక్ చేయడం చాలా గర్వంగా ఉందన్నారు సత్య కశ్యప్.
సరిహద్దుల్లో డ్రాగన్ కంట్రీ చేస్తున్న మోసాలను బయటపెట్టి పటిష్ఠ భారత్ ను బలహీనపరిచే చైనా కుట్రలను చూపించి అప్రమత్తం చేసే ఇలాంటి చిత్రాలను రావాలని చూసినవారు అభిప్రాయపడటం విశేషం.