ప్రపంచవ్యాప్తంగా భోజనప్రియులకు తెలుగోడి పలావ్ రుచి చూపించడానికి సరికొత్త ఆవిష్కరణ కావించబడుతుంది. అది కూడా అమెరికాలో. హోటల్స్ నిర్వహణలో అద్భుత విజయాలు సాధించిన కూచిపూడి వెంకట్‌ మరోసారి సరికొత్తగా పలావ్‌ రుచిని ప్రపంచానికి చూపించడానికి రంగం సిద్దమైంది. అదే కూచిపూడి పలావ్‌. గతంలో రాజుగారి తోట, మారేడుమిల్లి హోటల్స్‌ తో అరుదైన విజయాలు సాధించిన కూచిపూడి వెంకట్‌.. ఇప్పుడు ‘కూచిపూడి పలావ్‌’ పేరుతో మరో ఆవిష్కరణతో ముందుకొచ్చారు.
సాధారణంగా హోటల్స్ నిర్వహణలో ఎదురయ్యే సవాల్‌ షెఫ్స్‌. ఈ సవాల్‌ను సునాయాసంగా ఎదుర్కొని రాజుగారి తోట, మారేడుమిల్లి హోటల్స్‌ ద్వారా అద్భుత విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూచిపూడి పలావ్ స్టార్ట్ చేసారు. ఈ హోటల్‌ చెఫ్స్ ఎవరూ ఉండరు. మనకు నచ్చినట్టుగా మన అభిరుచికి తగ్గట్టుగా రుచికరంగా పలావ్ ను రెడీ చేయించే అవకాశం భోజనప్రియులకు కల్పిస్తారు. ఆంధ్ర, తెలంగాణ, అండమాన్, అరుణాచల్ ప్రదేశ్, అర్జైంటైనా, ఆఫ్రికా, అమెరికా… ఎక్కడైనా సరే.. షెఫ్స్ లేకుండా వేడి వేడిగా అత్యంత రుచికరమైన, ఆరోగ్యవంతమైన పలావ్ వడ్డించే “హోటల్స్”ను దర్జాగా నిర్వహించుకునే అత్యద్భుత అవకాశాన్ని అందిస్తున్నారు.
ప్రముఖ ఎన్నారై బిజినెస్‌మేన్ రాజు మండపాటి ఆధ్వర్యంలో అమెరికాలో “కూచిపూడి పలావ్‌” ను ఏర్పాటు చేసారు. ఈ హోటల్ ను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, తెలంగాణ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావులు ప్రారంభించారు. ఫుడ్ ప్రపంచంలో తెలుగోడి సత్తా చాటుతున్న కూచిపూడి వెంకట్, రాజు మండపాటి లను ప్రత్యేకంగా అభినందించారు.

Leave a comment

error: Content is protected !!