తెలంగాణా బ్యాక్‌డ్రాప్‌- దొరల దౌర్జన్యాలపై తిరుగుబాటు.. ఇలాంటి కంటెంట్‌తో ఎన్నో సినిమాలొచ్చాయి. కానీ రుద్రంగి రూటే వేరంటున్నాడు డైరెక్టర్‌ అజయ్‌ సామ్రాట్‌. తెలంగాణా ఉద్యమ నేపథ్యం ఉన్న రసమయి బాలకిషన్‌ ఈ సినిమాని నిర్మించారు. జగపతిబాబు, విమలారామన్‌, మమతా మోహన్‌దాస్‌ మెయిన్‌లీడ్‌ చేసిన ఈ సినిమా జులై 7 న రిలీజ్‌ కానుండటంతో ప్రమోషన్స్ జోరు పెంచారు. ఈ సందర్భంగా ఈ చిత్ర డైరెక్టర్‌ అజయ్‌ సామ్రాట్‌ ప్రింట్‌ మీడియాతో ముచ్చటించారు.
చూసిన సంఘటనలు, చదివిన కథలు, తెలుసుకున్న చరిత్ర.. వీటి నుంచే ఎన్నో చిత్రాలు పుడుతుంటాయి. రుద్రంగి కూడా అలాంటిదే. కాకపోతే దొరలపై తిరుగుబాటు నేపథ్యంలో వచ్చిన చిత్రాలకు చాలా భిన్నమైన అనుభూతినిస్తుంది. క్యారెక్టర్‌ మూడ్‌, డైలాగ్ మూడ్‌, లైటింగ్‌, టోన్‌ మూడ్‌ ఇలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని చేసిన సినిమా ఇది. ఈ సినిమా కోసం కెమెరామేన్‌తో కలసి ఆరేడు నెలలు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చేసి పక్కా ప్రణాళికతో షూట్‌ కి వెళ్లాం.
ఈ సినిమా కథ వినడానికే ఎవరూ ముందుకు రాలేదు. అయితే కరోనా టైమ్‌లో జగపతిబాబు గారికి ఓ నేరేషన్‌ ఇస్తే బాగుందన్నారు. .లాక్‌డౌన్ టైమ్‌లో మరోసారి ఫుల్ నేరేషన్‌ ఇచ్చాను.. దాంతో ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చారు. చాలా నమ్మకం పెట్టి చేసారు.
మమతా మోహన్‌దాస్‌ గారికి క్యాన్సర్‌ తగ్గిందని తెలియగానే ఈ స్క్రిప్ట్ వినిపించాను. పదేళ్లలో ఒక్క ఫోన్‌ కాల్ రాలేదు.. మీరు స్క్రిప్ట్‌తో వచ్చినందుకు థ్యాంక్స్‌ అన్నారు.
అలాగే మరో పాత్ర కోసం విమలారామన్‌ గారే కరెక్ట్ యాప్ట్ అనుకున్నాం. అందరూ చాలా ఇష్టపడి కష్టపడి పనిచేసారు ” అంటూ చెప్పాడు డైరెక్టర్‌ అజయ్ సామ్రాట్‌. జులై 7 న రుద్రంగి సినిమా ప్రపంచవ్యాప్తంగా ధియేటర్లలో రిలీజ్‌ అవుతోంది.

Leave a comment

error: Content is protected !!